Snow Leopard Photos : ఉన్నట్టుండి మన ఊళ్లో ఫుల్లుగా మంచు కురిసి... రోడ్లు, ఇళ్లు, వాహనాలపై అంతా మంచే ఉంటే ఏమవుతుంది? ఏది రోడ్డో, ఏది మలుపో అర్థం కాదు. అంతా మంచే కనిపిస్తుంది. ఇదే పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో హిమ చిరుతపులులకు తలెత్తుతోంది. అంతా మంచే ఉండటంతో.. అవి దారి తప్పి.. జనావాసాలవైపు వస్తున్నాయి. తాజాగా.. స్పితి లోయలో... భారీగా మంచు కురిసిన తర్వాత.. అక్కడ మంచు చిరుతల సంచారం పెరిగింది.