ఇంతకీ ఆ క్యాప్సూల్‌తో వచ్చిన సమస్య ఏంటంటే... అందులో రేడియోధార్మిక పదార్థం సీజియం - 137 (radioactive caesium-137) ఉంది. అందువల్ల ఆ క్యాప్సూల్‌ని ముట్టుకోవడమే కాదు.. దగ్గర ఉంచుకోవడం కూడా డేంజరే. అది తీవ్ర అనారోగ్యం వచ్చేలా చెయ్యగలదు. దీర్ఘకాలిక వ్యాధులు లేదా క్యాన్సర్ కూడా రాగలదు. అందువల్ల అలాంటిది కనిపిస్తే.. దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు తెలిపారు. (image credit - reddit - mr_finley_)
8 మిల్లీమీటర్ల పొడవు, 6 మిల్లీమీటర్ల వ్యాసం ఉండే ఆ క్యాప్సూల్‌ని ఈమధ్య ఓ ట్రక్కులో పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్ ఉత్తర ప్రాంతం నుంచి పెర్త్‌కు రవాణా చేశారు. తీరా పెర్త్‌కి వెళ్లాక చూస్తే... ఆ ట్రక్కులో అది కనిపించలేదు. ట్రక్ మొత్తం వెతికినా దొరకలేదు. అంటే.. మార్గమధ్యలో ఎక్కడో పడిపోయిందన్నమాట. (image credit - reddit - mr_finley_)
ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అది ఎక్కడ పడిందో ఏమో. ఆ ట్రక్కు 1400 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ దారిలో అది ఎక్కడో పడిపోయింది. అందువల్ల అధికారులు.. ఇప్పుడు ఆ మొత్తం దారి అంతా వెతుకుతున్నారు. ఐతే.. ఆస్ట్రేలియాలో గాలుల తీవ్రత ఎక్కువ. కాబట్టి... అది పడిన తర్వాత రోడ్డుపైనే ఉంటుందని గ్యారెంటీ లేదు. (image credit - reddit - mr_finley_)
అలాంటి ప్రమాదకరమైనది ఎక్కడో పడిపోవడం అనేది నిజంగా డేంజరే. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ క్యాప్సూల్ ఫొటోని రిలీజ్ చేసింది. అది సెంటీమీటర్ కంటే చిన్నగా ఉంది. ఎవరికైనా అది కనిపిస్తే దాన్ని ముట్టుకోకుండా... దాని దగ్గరకు వెళ్లకుండా... సమాచారం ఇవ్వాలని కోరడంతో... రెడ్డిట్ యూజర్ అలాంటి ట్రీడీ క్యాప్సూల్‌ని తయారుచేసి.. ప్రజలను అలర్ట్ చేశారు. (image credit - reddit - mr_finley_)