ఉత్తర ఇంగ్లాండ్‌లో నిర్మించిన ఈ ఇంటిని 'యార్క్‌షైర్ కాటేజ్' అని పిలుస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దానిని చేరుకోవడానికి నడక మార్గమే దిక్కు. ఆ ఇంటిని మీరు కొనుక్కోవాలి అనుకుంటే దానికి 3 లక్షల డాలర్లు (రూ.2,47,98,555) చెల్లించాలి. ఐతే.. ఎవరూ దాన్ని కొనకపోవడంతో.. ధర తగ్గించారు. ఇప్పుడు రూ.2 కోట్లకు అమ్మేందుకు సిద్ధపడ్డారు దాని ఓనర్లు. (Image Credit : Fisher Hopper)
మెట్రో ప్రకారం, UK రియల్ ఎస్టేట్ సంస్థ ఫిషర్ హాప్పర్ దీనిని అమ్మడానికి ప్రయత్నిస్తోంది. రిపోర్టు ప్రకారం యార్క్‌షైర్ కాలేజీ యాక్సెసిబిలిటీ రోడ్ నుంచి 1.5 కి.మీ. నడిస్తే ఈ ఇల్లు ఉండే కొండ వస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన వ్యక్తులు మాత్రమే దీన్ని కొనాలని అనుకోవడం మేలు. (Image Credit : Fisher Hopper)