Fetus In Baby Stomach: తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు.. డాక్టర్లు షాక్.. ఇదెలా సాధ్యం?
Fetus In Baby Stomach: తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు.. డాక్టర్లు షాక్.. ఇదెలా సాధ్యం?
Fetus in fetu: వైద్యరంగంలోనే సంచలన ఘటన ఇది. అప్పుడే పుట్టిన నవజాత శిశువు గర్భం దాల్చింది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పాప కూడా గర్భంతో ఉంది. గర్భంతో ఉన్న పాపను చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఇజ్రాయెల్‌లో ఈ వింత జరిగింది. అసలు ఇదెలా సాధ్యమైంది?
జులై తొలివారంలో ఇజ్రాయెల్‌లోని అష్దోడ్ నగరంలోని అస్సుటా ఆస్పత్రిలో ఓ మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఐతే ఆ చిన్నారి పొట్ట సాధారణం కన్నా పెద్దగా కనిపించింది. కడుపులో ఏదో ఉందని డాక్టర్లు కూడా భావించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఆ నవజాత శిశువుకు అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహిస్తే షాకింగ్ విషయం తెలిసింది. పాప గర్భంలో చనిపోయిన పిండం ఉన్నట్లు గుర్తించారు. ఆ పిండం పూర్తిగా వృద్ధి చెందరలేదు. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసి మృత పిండాన్ని తొలగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఇది చాలా అరుదైన సంఘటన అని డాక్టర్లు తెలిపారు. 10 లక్షల మందిలో ఒకరిలో మాత్రమే కనిపిస్తుందని డాక్టర్ ఒమర్ గ్లోబస్ తెలిపారు. చికిత్స అనంతరం పాప కోలుకుందని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఐతే ఇదెలా సాధ్యమంది? నవజాత శిశువు ఎలా గర్భం దాల్చిందన్న ప్రశ్నలకు డాక్టర్లు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. పాప తల్లి గర్భం దాల్చినప్పుడు రెండు పిండాలు ఉన్నాయి. వాస్తవానికి ఆమెకు కవల పిల్లలు పుట్టాలి.(Photo:AFP)
5/ 6
కానీ ఒక పిండం మరొక పిండంలోకి వెళ్లింది. ఒక పిండం పూర్తిగా వృద్ధి చెందగా.. మరో పిండం మాత్రం అందులో అలాగే ఉండిపోయి మరణిచిందని డాక్టర్లు తెలిపారు. దీనిని వైద్య పరిభాషలో fetus in fetu అని పిలుస్తారు.(Photo:AFP)
6/ 6
అచ్చం ఇలాంటి ఘటనే ఇండియాలో కూడా జరిగింది. మార్చిలో 18 నెలల బాలుడి కడుపులో నుంచి పిండాన్ని తొలగించారు. మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగు చూసింది. (ప్రతీకాత్మక చిత్రం)