Time Traveller : టైమ్ ట్రావెల్ సాధ్యమా అనే అంశంపై శతాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. చాలా మంది రకరకాలుగా ప్రయత్నించి ఫెయిలయ్యారు. కానీ విదేశాల్లో టిక్‌టాక్ వచ్చాక.. చాలా మంది తాము టైమ్ ట్రావెలర్లం అని చెప్పుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మరో వ్యక్తి కూడా ఇదే విధంగా చెబుతూ.. రుజువు ఇదిగో అంటూ.. ఓ వీడియోని పోస్ట్ చేశాడు. (image credit - tiktok - @worldcuptimetraveller)
ఇప్పుడు ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఎవరు గెలుస్తారో ముందే చెబుతూ.. అందుకు సంబంధించిన వీడియో ఇదే అంటూ.. ఓ క్లిప్‌ని టిక్‌టాక్‌లో చూపించాడు ఆ టైమ్ ట్రావెలర్. 2 సెకండ్లు మాత్రమే ఉన్న ఆ క్లిప్‌లో వరల్డ్ కప్ గెలిచిన జట్టు.. సంబరాల్లో ఉంటే.. ఓడిన జట్టు విచారంలో ఉంది. (image credit - tiktok - @worldcuptimetraveller)
2020 యూరో ఫైనల్లో ఇంగ్లండ్ ఓడిపోతుందని.. ఓ యూజర్ ముందే చెప్పాడు. అదే విధంగా జరగడంతో.. టైమ్ ట్రావెలర్ల అంశం హాట్ డిబేట్ అయ్యింది. అదే విధంగా ఇప్పుడు ఈ కొత్త టిక్‌టాకర్.. 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్, బ్రెజిల్ మధ్య పోరు ఉంటుందని తెలిపాడు. (image credit - tiktok - @worldcuptimetraveller)
ఈ వీడియోని 20 లక్షల మందికి పైగా చూశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. "అతను చెప్పిందే జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "ఇది నిజం లాగా ఎందుకు కనిపిస్తోంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఇది పాత సెలబ్రేషన్ క్లిప్" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఈసారి ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18న లుసాయిల్ స్టేడియంలో జరగనుంది. (image credit - tiktok - @worldcuptimetraveller)