సికింద్రాబాద్ తోపాటు ఎస్సీఆర్ పరిదిలోని అన్ని స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరల్ని పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఆదివారం రాత్రి వెల్లడించారు. నిజానికి గత వారం లోనే రైల్వేస్ ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకోగా, ఎస్సీఆర్ తాజా నిర్ణయంతో దాని ధర నాలుగు రెట్లు పెరిగినట్లయింది.
లోని కాచిగూడ, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబ్ నగర్, రామగుండటం, మంచిర్యాల, భద్రాచలం రోడ్, వికారాబాద్, తాండూర్, బీదర్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20కి పెంచామని, ఈ ధరలకు జనవరి 20 వరకు అమలలో ఉంటాయని ద.మ.రే అధికారులు చెప్పారు. ఇక స్పెషల్ ట్రైన్ల విషయానికొస్తే..
సంక్రాంతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కాచిగూడ-కాకినాడ టౌన్ (82724): ఈ నెల 12న రాత్రి 8 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.40కి చేరుతుంది. ఇది మల్కాజ్ గిరి, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. ఇక