చంద్రునిపైనే పంటలు పండించే రోజులు రాబోతున్నాయని నాసా శాస్త్రవేత్తలు రుజువుచేశఆరు. చంద్రుడి నుంచి తీసుకొచ్చిన మట్టితో ప్రయోగాలు చేసి, అందులో తొలిసారి మొక్కలను మొలిపించారు. తద్వారా రోదసీ వ్యవసాయ విజ్ఞానంలో గొప్ప ముందడుగు పడింది. లూనార్ సాయిల్ (చంద్రుడిపై మట్టి) విషయంలో అమెరికా సైంటిస్టులు సాధించిన ఈ విశేషానికి సంబంధించిన వివరాలను ‘కమ్యూనికేషన్స్ బయాలజీ’అనే జర్నల్ ప్రచురించింది.
చందమామపై మనం దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి చంద్రుడిపైకి వెళ్లొచ్చిన మానవుడు.. అక్కడి మట్టిని సేకరించడం తెలిసిందే. వివిధ దేశాల సహకారంతో నాసా నిర్వహించిన అపోలో 11, 12, 17 మిషన్స్‌లో చంద్రునిపై వివిధ ప్రాంతాల నుంచి మట్టి సేకరించారు. దానిని భూమ్మీదికి తీసుకొచ్చి, సరిగ్గా చంద్రుడిపై ఉండే వాతావరణ పరిస్థితులు కల్పించి ప్రయోగాలు చేపట్టారు.
చంద్రుడిపై మట్టిలో ఏదైనా విషయం ఉందా అని పలు ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. చంద్రుడి మట్టి(లూనార్ సాయిల్) లో తొలిసారి మొక్కలను మొలిపించగలిగారు సైంటిస్టులు. తాజా ప్రయోగంలో కేవలం 12 గ్రాముల ల్యూనార్ సాయిల్‌ను ఉపయోగించారు.
చేతి వేలు పట్టేంత పరిమాణం గల చిన్నపాటి ట్యూబ్స్ లో ల్యూనార్ సాయిల్ (రిగొలిత్)ను వేసి, వాటిలో విత్తనాలు నాటి ప్రతి రోజూ న్యూట్రియెంట్ సొల్యూషన్‌ను అందిస్తూ మొక్కలను మొలిపించారు. కూడా అందించారు. పరిశోధకులు తాజా ప్రయోగంలో కేవలం 12 గ్రాముల ల్యూనార్ సాయిల్‌ను ఉపయోగించారు. చంద్రుడి మట్టిలో మొదటిసారి మొలిచిన మొక్కలు ఆవాలు తరహాలో ఉండే కాలిఫ్లవర్ జాతికి చెందినవి.
చంద్రుడి మన్నుపై ప్రయోగాల్లో భాగంగా ఆవాల తరహాలోని అరబిడోప్సిస్ థలియానా రకం మొక్కలను పండించారు. ఈ విత్తనాలు యూరప్-ఆసియా, ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి ఆవ గింజలు, కాలిఫ్లవర్ తరహాకు చెందినవి. ఇవి చాలా తేలికగా పెరగడమే మాత్రమే కాకుండా విస్తృతంగా పరిశోధనలకు వీలుండటంతో అరబిడోప్సిస్ థలియా మొక్కలనే సైంటిస్టులు ఎంచుకున్నారు.
అరబిడోప్సిస్ థలియా మొక్కల జన్యుపరమైన కోడ్, ప్రతికూల పరిస్థితుల్లో దీని స్పందనలు కూడా సుపరిచితం. అదేవిధంగా రోదసి వాతావరణంలో వీటి పరిస్థితులపై కూడా అవగాహన ఉంది. అందుకే వీటిని ల్యూనార్ సాయిల్లో నాటారు. భూమిపైగల మట్టిలోనూ, అంగారక గ్రహం నుంచి తీసుకొచ్చిన మట్టిలోనూ కొన్ని విత్తనాలను నాటారు. రెండు రోజుల తర్వాత ఈ అన్ని రకాల మట్టిలలో నాటిన విత్తనాలు మొలకెత్తాయి.
ల్యూనార్(చంద్రుడు), భూమి, అంగారక మట్టిలలో నాటిన విత్తనాల నుంచి వచ్చిన మొక్కలన్నీ ఆరు రోజుల వరకు ఒకే విధంగా కనిపించాయి. ఆరు రోజుల తర్వాత వీటి మధ్య తేడాలు కనిపించాయి. ల్యూనార్ సాయిల్లోని మొక్కల ఎదుగుదల నెమ్మదిగా ఉన్నట్లు, వేళ్లు గిడసబారినట్లు కనిపించాయి. 20 రోజుల తర్వాత ఈ మొక్కలన్నిటినీ కోసి, వాటి డీఎన్ఏపై అధ్యయనాలు నిర్వహించారు. అని అధ్యయనంలో రాశారు.
ప్రతికూల వాతావరణాల్లో పెరిగినవాటి మాదిరిగానే ల్యూనార్ ప్లాంట్స్ కూడా ప్రతిస్పందిస్తున్నట్లు ఈ విశ్లేషణల్లో తేలింది. ఉప్పు కలిపిన మట్టిలోనూ, భార లోహాలు కలిసిన మట్టిలోనూ పెరిగిన మొక్కల మాదిరిగానే ఇవి కూడా స్పందించినట్లు గమనించారు. ఈ వాతావరణం మరింత అనుకూలంగా ఉండేలా చేయడమెలా? అనే దానిని శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు.
ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా చంద్రునిపైకి మళ్ళీ వెళ్ళాలని సాసా సిద్ధమవుతోంది. చంద్రుని ఉపరితలంపై మానవుడు శాశ్వతంగా ఉండేవిధంగా చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో వెళ్ళబోతోంది. అదేవిధంగా ల్యూనార్ స్టేషన్‌ను నిర్మించేందుకు చైనా, రష్యా చేతులు కలిపాయి. దీర్ఘకాలిక పరిశోధనల లక్ష్యాలకు తాజా పరిశోధన అత్యంత కీలకమైనదని నాసా చీఫ్ బిల్ నెల్సన్ అంటున్నారు.
చంద్రుని చీకటి భాగానికి ఆవలివైపునగల ప్రాంతంలో నివసిస్తూ, కార్యకలాపాలను నిర్వహించే వ్యోమగాముల కోసం ఆహార వనరులను అభివృద్ధి చేయడానికి అంగారక, చంద్రులపై దొరికిన వనరులను మనం ఉపయోగించుకోవలసిన అవసరం ఉందదని, ఆ దిశగా ప్రయోగాలు, ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని నాసా చీఫ్ చెబుతున్నారు. (ఇదొక్కట ప్రతీకాత్మక చిత్రం)