Rough cocklebur : ఆర్ట్గల్ అనగా కకల్బార్ అనే పేరు గల.. వేగంగా వ్యాపించే మొక్క. ప్రధానంగా దక్షిణ ఐరోపా, మధ్య ఆసియా, చైనాలలో కనిపిస్తుంది. చాలా మందికి ఇది కలుపు మొక్క. పనికిరాని మొక్క. సౌత్ కొరియాకు చెందిన మియోంగ్జీ యూనివర్సిటీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఆ మొక్క పండులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇవి త్వరగా ముసలితనం రాకుండా చేయగలవని తేల్చారు. (Image credit - Wikimedia Commons)
ఆర్ట్గల్ మొక్క ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇటువంటి మొక్కలు సాధారణంగా నదీ తీరాల వెంట.. తేమ, ఇసుక ప్రాంతాల్లో.. అలాగే రోడ్డు పక్కన నీరు నిండిన గుంటల్లో కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ మొక్కలను ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ మొక్కలోని ముళ్లతో కూడిన పండులో పదార్థాలు సూర్యుడి అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడగలవని తేల్చారు. ఈ పండు గాయాలను త్వరగా నయం చేయగలదని కనుక్కున్నారు. (Image credit - Wikimedia Commons)
ఆర్ట్గల్ ఫ్రూట్లోని పదార్థాలు.. మన శరీరంలో... కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇది చర్మానికి ముఖ్యమైనది. ఇది చర్మంపై ముడతల్ని తగ్గిస్తుంది. వివిధ ప్రదేశాలలో పండించే కకల్బార్ పండ్లను పోల్చి చూస్తే, చైనాలో కంటే... దక్షిణ కొరియాలో పండించే పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలుసుకున్నారు. (Image credit - Wikimedia Commons)
మియోంగ్జీ యూనివర్సిటీ విద్యార్థి యూన్సు సాంగ్ మాట్లాడుతూ... ఈ పండు చర్మాన్ని రక్షించే సామర్థ్యాలను కలిగి ఉంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచగలుగుతోంది. ఈ పండును స్కిన్ కేర్, కాస్మెటిక్ ఉత్పత్తుల్లో వాడొచ్చు. యాంటీ ఏజింగ్ ఉత్పత్తుల్లో దీన్ని వాడితే.. మరింత బాగా పనిచేస్తాయి అని తెలిపారు. (Image credit - Wikimedia Commons)