ఐదున్నర నెలల కిందట తన సోదరుడి స్నేహితుడు చేపల పెంపకం కోసం నిర్మించిన చెరువు దగ్గర అఫ్రోజ్ సారస్ కొంగను చూశాడు. అది చిన్న పక్షి పిల్లలా ఉంది. అది కొంగ పిల్ల అని కూడా అఫ్రోజ్కి తెలియదు. నెల వయస్సు ఉన్న ఆ పిల్లను ఇంటికి తెచ్చాడు. అది పెరిగి పెద్దదై.. 5 అడుగుల ఎత్తు పెరిగింది. ఆ కుటుంబంలో సభ్యురాలైపోయింది.
అమేథీ జిల్లాలోని మంద్ఖా గ్రామానికి చెందిన ఆరిఫ్‌తో... ఓ సారస్ కొంగ స్నేహం చేస్తోంది. అతను ఆ కొంగ పేరున ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి.. కొంగ వీడియోలు పోస్ట్ చేస్తూ మనీ సంపాదిస్తున్నాడు. అఫ్రోజ్కి ఈ విషయం తెలిసినా.. అతను మాత్రం ఆ కొంగ పేరున మనీ సంపాదించాలి అనుకోలేదు. కుటుంబంలో అందంరం స్వీటీని నిజంగా ప్రేమించామనీ.. దాని నుంచి ఏదీ ఆశించలేదని ఆయన తెలిపాడు. ఇలా కొంగలు మనుషులతో స్నేహం చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.