1. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇక శబరిమల యాత్రకు మీరు ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. www.sabarimalaonline.org వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. వర్చువల్ క్యూ ఆన్లైన్ బుకింగ్‌తో పాటు ఇతర సేవల్ని కూడా బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వర్చువల్ క్యూ సర్వీస్ భక్తులకు ఉచితం. వర్చువల్ క్యూ సిస్టమ్ అమలు చేసిన తర్వాత భక్తులకు అయ్యప్ప సందర్శన సమయం 4 గంటల 28 నిమిషాల నుంచి 2 గంటల 41 నిమిషాలకు తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. వెబ్సైట్లో మీ పేరు, అడ్రస్, ఫోటో, వయస్సు, ఫోన్ నెంబర్, స్కాన్ చేసిన ఐడీకార్డ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. స్కూల్ విద్యార్థులు ఐడీ కార్డుతో రిజిస్టర్ చేయొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలు బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. కుటుంబ సభ్యులు, స్నేహితుల బృందం శబరిమల యాత్రకు ప్లాన్ చేసినా ఎవరికివారు వేర్వేరుగా బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకే బుకింగ్ అందరికీ వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వర్చువల్ క్యూ స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగా sabarimalaonline.org వెబ్సైట్ ఓపెన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. మీ పేరు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వివరాలతో లాగిన్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. హోమ్ పేజీలో Virtual-Q ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. తేదీని సెలెక్ట్ చేసిన తర్వాత ఏఏ తేదీల్లో ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. మీకు కావాల్సిన స్లాట్ ఎంచుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
11. వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తైన తర్వాత మీ ఇమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12. ఆన్లైన్లో కూపన్ ప్రింట్ తీసుకోవాలి. కూపన్లో యాత్ర తేదీ, సమయం లాంటి వివరాలుంటాయి. కూపన్‌తో పాటు ఫోటో ఉన్న ఐడీ కార్డులు వెంట తీసుకెళ్లాలి. (ప్రతీకాత్మక చిత్రం)
13. కూపన్ వెరిఫికేషన్ కౌంటర్ల దగ్గర కూపన్ చూపించాలి. వర్చువల్ క్యూ యాక్సెస్ కార్డ్, ఐడీ కార్డ్ ఉన్నవారినే క్యూలో అనుమతిస్తారు. కూపన్లో వెల్లడించిన తేదీ, సమయానికి కౌంటర్ దగ్గరకు వెళ్లాలి. (ప్రతీకాత్మక చిత్రం)