మనుషులే కాదు ..మర మనుషులు కూడా సమాజంలో అన్నీ ఉద్యోగాల్లో పోటీ పడుతున్నాయి. ఈవిషయం ఎందుకు చెబుతున్నామంటే దక్షిణ కాలిఫోర్నియాలోని టుస్టిన్లో ఐ కెన్ బార్బెక్యూ అనే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ సిబ్బందిగా రోబోలు పని చేస్తున్నాయి. కస్టమర్లకు సర్వీస్ చేయడంతో పాటు తోటి సిబ్బందికి విశ్రాంతి ఇస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి.
ఏదైనా పని వేగంగా చేయమంటే మేము ఏమైనా రోబోలము అనుకున్నావా అంటారు. నిజంగా ఈ రెస్టారెంట్లో రోబోలు అది నిజం అని రుజువు చేస్తున్నాయి. హోటల్‌కి వచ్చే అనేక భాషలు మాట్లాడే కస్టమర్లను ఆకర్షించేందుకు 50రకాల భాషలు నేర్చుకొని ఉద్యోగాలు చేస్తున్నాయి. రోబోలు ఆర్డర్ తీసుకోవడం, ఆహార పదార్ధాలు సప్లై చేయడం చూసి చిన్నారులు ఈ రెస్టారెంట్‌కి ఆకర్షితులయ్యారని యజమాని చెబుతున్నాడు.