3. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 25న ముగుస్తుంది. ఈ సిరీస్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ఒక గ్రామ్ ధర రూ.3,835. ఆన్లైన్లో అప్లై చేసి పేమెంట్ చేసే ఇన్వెస్టర్లకు ఒక గ్రాముపై రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఒక గ్రాము గోల్డ్ బాండ్ రూ.3,785 ధరకే సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వం దశల వారీగా గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రకటిస్తూ ఉంటుంది. అయితే సామాన్యులకు సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి అవగాహన కాస్త తక్కువగానే ఉంది. అందుకే పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తుంటారు. సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. సాధారణంగా డబ్బు పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించడం కోసం బంగారాన్ని కొంటూ ఉంటారు. అయితే ఈ బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొంటారు. దాచుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఫిజికల్ గోల్డ్‌ని దాచుకోవడం ఓ పెద్ద సమస్య. అందుకే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 2015న ప్రారంభించింది. ఫిజికల్ గోల్డ్‌కు ఉన్న డిమాండ్ తగ్గించడం కూడా ఓ కారణం. సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతాయి. గోల్డ్ బాండ్స్‌ని బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఓ వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. మైనర్ పేరు మీదా ఈ బాండ్ తీసుకోవచ్చు. మీరు లక్షల రూపాయలతో బంగారం కొంటే నగలను భద్రంగా దాచడానికి తిప్పలు పడాల్సి వస్తుంది. అదే మీరు ఎన్ని లక్షలతో గోల్డ్ బాండ్స్ కొన్నా మీ పెట్టుబడి సురక్షితమే. (ప్రతీకాత్మక చిత్రం)
7. రూ.20,000 వరకు నగదు, అంతకన్నా ఎక్కువైతే డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. మీరు ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఎలాంటి కేవైసీ నిబంధనలు ఉంటాయో అవే గోల్డ్ బాండ్స్ కొనడానికీ వర్తిస్తాయి. ప్రతీ దరఖాస్తుపైన ఇన్వెస్టర్ పాన్ నెంబర్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
8. గోల్డ్ బాండ్స్ వల్ల లాభమేంటీ?: గోల్డ్ బాండ్స్ కూడా ఓ పెట్టుబడి సాధనమే. వీటిని డిమాట్ రూపంలోకి మార్చుకోవచ్చు. వీటిని తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించే గోల్డ్ లోన్‌కు సమానంతో గోల్డ్ బాండ్స్‌పై లోన్స్ తీసుకోవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లపై జీఎస్టీ లేదు. అదే మీరు నగలు కొంటే 3% జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. ఆ లెక్కన చూసినా గోల్డ్ బాండ్ లాభదాయకమే. (ప్రతీకాత్మక చిత్రం)
9. గోల్డ్ బాండ్స్‌పై వచ్చే వడ్డీకి ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై సంవత్సరానికి నామమాత్రపు విలువపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. అసలుతో పాటు మెచ్యూరిటీపైన వడ్డీ లభిస్తుంది. ఒక్కసారి బాండ్ కొంటే ఎనిమిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత అప్పుడు ఉన్న బంగారం ధరతో సమానంగా తిరిగి చెల్లిస్తారు. దాంతోపాటు వడ్డీ కూడా లభిస్తుంది. బాండ్ జారీ చేసిన ఐదేళ్ల తర్వాత అవసరం అనుకుంటే... బాండ్ ఇచ్చేసి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)