Republic Day 2022 | ఈ రోజు మనందరం 73వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. ప్రతి యేడాది గణతంత్య్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగరవేయం ఆనవాయితీ వస్తోంది. ఈ సందర్భంగా జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే.. త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.. (News18/Photo)
జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారంజాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి. ఈ దేశం మనది. మనందరిది కాబట్టి, ఆవిధులలో కొన్ని.. జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు: రెండు నిష్పత్తిలో ఉండాలి. జెండాకు తొమ్మిది రకాల కొలతలున్నాయి. (News18/Photo)
1) 6300×4200 మిల్లీమీటర్లు. 2) 3600×2400 మిల్లీమీటర్లు. 3) 2700×1800 మిల్లీమీటర్లు. 4) 1800×1200 మిల్లీమీటర్లు. 5) 1350×900 మిల్లీమీటర్లు. 6) 900×600 మిల్లీమీటర్లు. 7) 450×300 మిల్లీమీటర్లు. 8) 225×150 మిల్లీమీటర్లు. 9) 150×100 మిల్లీమీటర్లు. ఇందులో చాలా పెద్ద సైజు 6300×4200 మిల్లీమీటర్లు. చిన్న సైజు 150×100 మిల్లీమీటర్లు. (News18/Photo)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల మీద అనగా హైకోర్టు, గవర్నర్ సచివాలయం, ముఖ్యమంత్రి, సచివాలయం, కమీషనర్ల కార్యాలయాలు, పోలిస్ కమీషనరేట్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పోలిస్ కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తులు,మున్సిపాలిటీలు…మెదలైన ప్రభుత్వ భవనాలపై ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురవేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)