Republic Day 2022 | ఈ రోజు మనందరం 73వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. త్యాగాన్ని తెలిపే కాషాయం, శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. భావి తరాలకు కానుక మన మువ్వన్నెల జెండా అన్నది తెలిసిన నాడు ఎంత కఠిన నిబంధనలు ఉన్నా మనం మన పతాకం పట్ల ప్రేమాభిమానాలను నానాటికీ పెంచుకుంటూనే ఉంటాం. (News18/Photo)
జాతీయ పతాకాన్ని అలంకరణంగా గాని, తోరణాలుగా గాని, దుస్తులుగా గాని కుట్టించుకోకూడదు. శరీరం పై ధరించే వస్త్రాలుగా గాని, జాతీయ పతాకం పై ఎలాంటి వ్రాతలు వ్రాయరాదు. దీనిని సంచిలా వాడుకొనరాదు. అలాగే ఏదైనా సమావేశాల వేదికపై కప్పరాదు. ఏదైనా కంపెని వాణిజ్య పరమైన లాభాల కోసం జాతీయ పతాకాన్ని వాడరాదు.(ప్రతీకాత్మక చిత్రం)