యడ్యూరప్ప కుమార్తె పద్మావతి కూతురైన డాక్టర్ సౌందర్యకు మూడేళ్ల క్రితం డాక్టర్ నీరజ్‌తో వివాహమైంది. వీరికి 9 నెలల మగశిశువు ఉన్నారు. దంపతులిద్దరూ బెంగళూరు నగరంలోని ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ రామయ్య మెడికల్ కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. సీఎం మనవరాలిగానే కాక, ప్రముఖ వైద్యురాలిగానూ పేరున్న సౌందర్య మరణం చర్చనీయాంశమైంది.