పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయనకు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటే తత్వం ఈయనకు ఇతరుల కన్నా ప్రత్యకంగా నిలిపింది. టాటా గ్రూప్‌కు గౌరవ చైర్మన్‌గా ఉన్నా ఈయన అందరికీ ఆదర్శమని చెప్పుకోవచ్చు. ఎలాంటి గర్వం ఉండదు. చాలా సాధారణమైన జీవనాన్ని కొనసాగిస్తారు.
రతన్ టాటాకు జంతువులు అంటే, ముఖ్యంగా కుక్కలు అంటే ఎంత ప్రేమో చెప్పాల్సిన పనిలేదు. కుక్కల మీద ఆయన ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇన్ స్టా గ్రామ్ పోస్టులను గమనిస్తే ఆయనకు కుక్కల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు బుజ్జి బుజ్జి కుక్క పిల్లల ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే, కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపండి అంటూ అందరిలోనూ చైతన్యం నింపుతారు.
గోవాతో సహా తన పెంపుడు కుక్కలతో కలసి ఉన్న ఫోటోలను రతన్ టాటా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా గోవాకు ఆ వింతైన పేరు ఎందుకు పెట్టారని ఓ నెటిజన్ ప్రశ్నించారు. తను ఓసారి గోవా వెళ్లినపుడు ఎక్కడి నుంచో వచ్చిన ఓ చిన్న వీధి కుక్క పిల్ల తన స్నేహితుడి కారులోకి ప్రవేశించిందని.. దానిని తనవెంట తీసుకొచ్చానని టాటా వెల్లడించారు. అందుకు గుర్తుగా దాని పేరు గోవా అని పెట్టినట్టు ఆయన వివరించారు. అయితే, పెంపుడు శునకాలతో ఉన్నప్పటికీ మాస్క్ ధరించడం మరచిపోని ఈ 82 ఏళ్ల పారిశ్రామిక దిగ్గజం అప్రమత్తతను పలువురు అభినందిస్తున్నారు.
అలాగే, కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపండి అంటూ అందరిలోనూ చైతన్యం నింపుతున్నారు రతన్ టాటా. ముఖ్యంగా గాయపడిన కుక్కలు, వీధి కుక్కల మీద ప్రేమ చూపాలని కోరుతున్నారు. కొద్ది నెలల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ లో ‘స్ప్రైట్ అనే కుక్కకు ఓ మంచి ఫ్యామిలీ దొరికేందుకు మీరు సాయం చేయగలరా?’ అంటూ కామెంట్ చేశారు.
ఇంతకు ముందు కూడా మీరు నాకు రెండు సార్లు సాయం చేశారు. అందుకు నేను చాలా కృతజ్ఞుడిని. ఇప్పుడు మరోసారి మిమ్మల్ని కోరుతున్నా. ఈ స్ప్రైట్‌కు ఓ కుటుంబాన్ని వెదికేందుకు నాకు సాయం చేస్తారా? ఈ కుక్కకు ఓ ప్రమాదంలో కాళ్లు రెండు చచ్చుబడిపోయాయి. దీన్ని దత్తత తీసుకోవాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.’ అంటూ రతన్ టాటా ఓ కుక్క ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు.