గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బస్సు సడెన్గా ఆగిపోయిందనుకోండి. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఉంటాడని అనుకుంటాం. మరి అత్యంత వేగంగా తిరిగే ఓ నక్షత్రం వేగం... సడెన్గా తగ్గిపోతే... దానికి కారణం ఏమై ఉంటుంది? బస్సుకి డ్రైవర్ ఉండటం లాజిక్. మరి నక్షత్రంలో అలా ఎవరూ ఉండరు కదా. కానీ ఆ నక్షత్రం అలా చేయడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలా ఎందుకు జరిగింది అని అన్వేషించారు. రకరకాల అధ్యయనాలు జరిగాయి. తాజాగా ఓ కొత్త అధ్యయనం ప్రకారం.. ఆ నక్షత్ర ఉపరితలంపై ఓ అగ్ని పర్వతం లాంటిది పేలిందని అంచనా వేశారు. దాని వల్లే నక్షత్ర వేగం తగ్గి ఉంటుందని అంచనా వేశారు. నక్షత్ర అయస్కాంత ధ్రువం దగ్గర ఈ పేలుడు జరిగివుండొచ్చనీ.. అందువల్లే వేగం తగ్గి ఉంటుందని భావించారు. (ప్రతీకాత్మక చిత్రం)
నక్షత్రాల కాలగమనం పూర్తైన తర్వాత పేలిపోతాయి. ఆ తర్వాత అవి మృత నక్షత్రాలుగా మిగిలిపోతాయి. అవి కొన్ని కిలోమీటర్ల వెడల్పు మాత్రమే కలిగివుంటాయి. ప్రతి కొన్ని సెకండ్లకూ అవి ఓ భ్రమణాన్ని (Rotation) పూర్తి చేస్తాయి. వాటి నుంచి అత్యంత తీవ్రమైన అయస్కాంత క్షేత్రాలు విశ్వంలోకి విడుదలవుతూ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)