అడిగినంత కట్నం ఇవ్వలేదనో, కట్నం తక్కువ అయ్యిందనో పెళ్లికి వరుడు నో చెప్పిన ఘటనలు అనేకం జరిగాయి. చివరి నిమిషంలో పెళ్లి కొడుకో లేదా పెళ్లి కొడుకు తల్లిదండ్రులో కట్నం విషయంలో అలిగి పెళ్లి రద్దు చేస్తుంటారు. ఇలా చాలా చోట్ల జరిగింది. ఇది కామన్. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ.. చెల్లెలి పెళ్లి కోసం అన్నలు రికార్డులు బద్దలు కొట్టే విధంగా కట్నకానులు ఇవ్వడం అరుదు.
నాగౌర్ జిల్లాలో కట్నంకు సంబంధించిన రికార్డులన్నీ తాజాగా బ్రేక్ అయ్యాయి. ఇలా పెళ్లి వేడుకకు కట్నకానులు సమర్పించడాన్ని స్థానికంగా మైరా అంటారు. మైరా ఎన్నో ఏళ్లుగా నాగౌర్ లో కొనసాగుతున్న సాంప్రదాయం. దీన్నే మైరా గా పిలుస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లిలో ఇది ఓ భాగం. చెల్లెలికి ఆర్థిక భారం తగ్గించేందుకు ఆమె సోదరులు ఈ మైరాను అందజేస్తారు. ఇందులో భాగంగా సోదరి వివాహాన్ని సోదురులే దగ్గరుండి జరిపిస్తారు.
ఇటీవల ఇదే ప్రాంతంలో మేనకోడలి పెళ్లి కోసం ముగ్గురు మేనమామలు కలిసి కోట్ల విలువజేసే కానుకలు చదివించుకున్నారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ముగ్గురు రైతు సోదరులు చరిత్ర సృష్టించారు. తన మేనకోడలి పెళ్లికి 3 కోట్ల 21 లక్షల రూపాయల విలువచేసే కట్నకానుకలు చదివించుకున్నారు. ఒక ధనిక వ్యవసాయ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్రలు తమ మేనకోడలిపై ప్రేమను చాటుకున్నారు.