లోని బార్మర్ ప్రాంతంలో థార్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఇక్కడ మెయిన్ గా.. 40 నుంచి 50 తులాల బంగారు ఆభరణాలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. అందరికన్న అందంగా కన్పించేందుకు ప్రయత్నింస్తుంటారు. పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సంస్కృతి, వారసత్వం, జానపద కళలను సజీవంగా ఉంచడానికి థార్ మహోత్సవ్ ను ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు.
ఈ పోటీదారులు చైన్, ఆర్మ్లెట్, వీల్, నాథ్, టికా, నడుము బ్యాండ్, హ్యాండ్ ఫ్లవర్, ట్రియో, జీలం, కాన్పట్టి, యూనిక్, ఫీనీ వంటి రెండు డజన్లకు పైగా బంగారు ఆభరణాలను ధరించి థార్ ఫెస్టివల్‌కు చేరుకున్నారు. ప్రజలు. దాదాపుగా.. మొత్తం 30 మంది పోటీదారులు కోటి కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు ధరించి ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చారు.
ఈ ఆభరణాలు పోతాయేమోనన్న శ్రద్ధ, భయం కారణంగా, చాలా మంది పాల్గొనేవారి బంధువులు కూడా ఒకచోట చేరి వాటిని చూసుకోవడం కనిపించింది. థార్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు వచ్చిన మనీషా సోనీ మాట్లాడుతూ రాజస్థాన్ జానపద సంస్కృతికి థార్ మహోత్సవం చాలా ముఖ్యమైనదని అన్నారు. ఆమె స్వయంగా 35-40 తులాల బంగారు ఆభరణాలు ధరించి వచ్చింది.
బికనీర్‌కు చెందిన కోమల్ సిద్ధా మాట్లాడుతూ, బికనీర్‌లో మిస్ మార్వాన్, జైసల్మేర్ యొక్క మారు మహోత్సవ్ తర్వాత, ఇప్పుడు ఆమె బార్మర్‌లోని థార్ మహోత్సవ్‌లో పాల్గొనడానికి వచ్చినట్లు చెప్పారు. మూడు ఉత్సవాల్లో పాల్గొని, 35 తులాల బంగారు ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొనడం వల్ల ఆమెకు థార్ సుందరి అనే బిరుదును నిర్వాహకులు ఇచ్చినట్లు సమాచారం.