దిగ్గజ ప్రత్యర్థుల్ని చిత్తు చేసి ఒలింపిక్ స్వర్ణ శిఖరాన్ని అందుకున్న తెలుగు తేజం సింధు.. బ్యాడ్మింటన్ స్టార్.. ఎన్నో టోర్నీలు గెలిచి భారత బ్యాడ్మింటన్ దిగ్గజంగా ఎదిగిన తార.
2/ 8
ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.
3/ 8
ఒలింపిక్స్ ఫైనల్లో రజత పతకం సాధించి ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది.
4/ 8
సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.
5/ 8
అయితే సింధు విజయం వెనుక ఆమె తండ్రి పాత్ర ఉంది. స్వతహాగా వాలీబాల్ క్రీడాకారుడు అయిన సింధు తండ్రి రమణ. ఆమెను స్పోర్ట్స్ వైపు నడిపించాడు.
6/ 8
హైదరాబాదులో జన్మించిన పీవీ సింధు.. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే బ్యాడ్మింటన్ క్రీడను అభ్యసిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు.
7/ 8
ఆమె తండ్రి రమణ స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం సంపాదించారు. అయితే తండ్రి వాలీబాల్ క్రీడాకారుడు.
8/ 8
పీవీ సింధు తల్లి విజయకూ తన జీతాన్ని ఇంటి ఖర్చుల కోసం ఉపయోగించగా, సింధు తండ్రి పీవీ రమణ తన జీతాన్ని పూర్తిగా సింధును క్రీడాకారిణిగా తీర్చిదిద్దడం కోసమే ఖర్చు చేశారు. అందుకే ఆమె విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది.