పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మరో కొత్త చరిత్రను లిఖిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మరోసారి వార్తలలో నిలిచింది. ఈ రోజు నుంచి (జూలై 1) నివాస ఇళ్లకు 300 యూనిట్ల వరకు కరెంట్ ను ఫ్రీగా ఉపయోగించుకొవచ్చు. దాదాపు.. 300 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు రాదు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అనేక హమీలను ఇచ్చింది. దీనిలో ఇప్పటికే అనేక పథకాలు అమలు చేసింది. నేటి నుంచి పంజాబ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ను అమలు చేయనుంది. దాదాపు.. 300 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఉపయోగించుకొవడానికి వెసులు బాటు లభించింది. దీనిపై.. సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
భగవంత్ మాన్ దాస్ ఇప్పటికే.. అనేక పథకాలను పంజాబ్ లో అమలు చేశారు. అధికారంలోనికి వచ్చిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు హామీలు ఇచ్చినా ఏళ్లు గడిచిన అవి.. అమలు చేసేవి కావని మండిపడ్డారు. కానీ తమ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటోందని భగవంత్ మాన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఉచిత విద్యుత్ పథకంపై ఆప్ (aap) నేత, ఎంపీ గౌరవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు. దేశంలో నివాస గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఢిల్లీ తర్వాత పంజాబేనని అన్నారు. పంజాబ్ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చిందని గౌరవ్ అన్నారు. ఈ పథకం అమలు చేయడం వల్ల పంజాబ్ ప్రభుత్వ ఖజానాపై రూ.1,800 కోట్ల భారం పడుతుందని ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ పేర్కొన్నారు.