ఈ యువతి పేరు పప్పీ ఓ తూలే (Poppy O’Toole). చాలా మందికి లాగే... కరోనా వచ్చాక... ఈమె జీవితం కూడా అల్లకల్లోలం అయ్యింది. ఉద్యోగం పోయింది. ఏం చెయ్యాలో తెలియని స్థితి వచ్చేసింది. సరిగ్గా అప్పుడే అదృష్టదేవత గట్టిగా తలుపుతట్టింది. ఫలితంగా ఇప్పుడీ అమ్మాయి... బంగాళా దుంపలతో వంటలు చేస్తూ రోజూ లక్షలు సంపాదిస్తోంది. నెల నెలా కోట్లు కూడబెడుతోంది. ఆలూ వంటలతోనే ఇంతలా ఫేమస్ అవ్వడం ఈమెకే చెల్లింది. (image credit - instagram - poppy_cooks)
బ్రిటన్‌కి చెందిన పప్పీ వయస్సు 27 ఏళ్లు. ఓ ప్రముఖ సంస్థలో రెసిపీలు ఎలా వండాలో నేర్చుకుంది. ఆ తర్వాత మరో ప్రముఖ సంస్థలో ఉద్యోగం పొందింది. వారానికి 70 గంటలు కష్టపడుతూ... వంటలు చేసింది. ఏం లాభం... అంత కష్టపడినా... వచ్చే జీతం సరిపోయేది కాదు. ఇంటి రెంట్ చెల్లించడం కష్టమయ్యేది. ఆ సమయంలో కరోనా వచ్చి... ఉన్న ఉద్యోగం పోయింది. దాంతో... మరిన్ని కష్టాల్లోకి జారుకుంది. అదే సమయంలో... ఆమె పేరెంట్స్... సాయంతో టిక్ టాక్‌లో పర్సనల్ వీడియోలు పోస్ట్ చెయ్యడం ప్రారంభించింది. (image credit - instagram - poppy_cooks)
ఓ రోజు అలవాటు ప్రకారం... బంగాళా దుంపతో ఓ రెసిపీ వండి... టిక్‌టాక్‌లో పెట్టింది. అంతే... ఆ వీడియోని విపరీతంగా చూశారు. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆశ్చర్యపోయింది. ఇదేదో బాగుందే... ఇంకేం.. ఇలాంటివే చేసి పెడతాను అనుకొని... ఆలూతో చేసిన వంటల వీడియోలను పోస్ట్ చెయ్యడం మొదలుపెట్టింది. (image credit - instagram - poppy_cooks)
కొన్ని నెలల కిందట పప్పీ వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆమె అమెరికాలో అతి పెద్ద టిక్ టాక్ స్టార్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడామె 24 గంటలూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పనిచేస్తూ... రెండు చేతులా సంపాదిస్తోంది. టాలెంట్ ఉంటే సరిపోదు... లక్ కూడా కలిసి రావాలి. అది పప్పీ విషయంలో నిజమైంది అంటున్నారు ఫ్యాన్స్. (image credit - instagram - poppy_cooks)