Polling Day : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Polling Day : తెలంగాణలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంతోపాటూ... మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలు, హర్యానాలోని 90 సీట్లకు, వాటితోపాటు 51 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్... సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు తరలివస్తున్నారు. పోలింగ్ దృష్ట్యా అన్ని నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 24న గురువారం రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్‌ దృష్ట్యా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను పెంచినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.