ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటం ఇప్పటికే దేశంలో కేసులు 300 దాటడం, రాబోయే రోజుల్లో ఇది మరింత ప్రమాదకర స్థాయికి వెళుతుందనే అంచనాల నేపథ్యం మోదీ సర్కార్ ఒమిక్రాన్ పై తీవ్ర మథనం జరుపుతోంది. రెండో ఆలోచన లేకుండా కేంద్రం లాక్ డౌన్ దిశగా కదులుతున్నట్లు వెల్లడైంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోదీ గురువారం జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో లాక్ డౌన్ నిర్ణయంపైనే తీవ్ర మేథోమథనం జరిపినట్లు తెలిసింది.
గతంలో కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైన అనుభవం దృష్ట్యా ఈసారి లాక్ డౌన్ విధింపునకు కేంద్రం తొలి నుంచీ విముఖంగా ఉంది. అయితే, ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్రాల తీరు మారకపోవడం, ప్రజా ప్రతినిధులు కూడా మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వైనంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ కట్టడికి కేంద్రమే కఠిన నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితిని పరిణామాలు దారి తీశాయి. దీంతో..
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాత్రి పూట లాక్ డౌన్ విధించాలని మోదీ సర్కార్ యోచిస్తున్నది. దీనికి సంబంధించిన నిర్ణయం మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది. గురువారం నాటి సమీక్షా సమావేశంలోనూ ప్రధాని మోదీ ‘నేషనల్ వైడ్ లాక్ డౌన్’ అంశంపైనే తీవ్ర మథనం జరిపినట్లు వెల్లడైంది. పీఎంవో చేసిన అధికారిక ప్రకటన కాకుండా, అసలా మీటింగ్ లో ప్రధాని మోదీ ఏం మాట్లాడారనేదానిపై సాక్ష్యాత్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన విషయాలు చెప్పారు.
ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం రాత్రి పూట లాక్ డౌన్ విధించబోతున్నదని, ఇదే అంశంపై ప్రధాని మోదీ ఇవాళ్టి సమీక్షలో లోతుగా చర్చించారని అజిత్ పవాత్ తెలిపారు. గురువారం నాడు మహారాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల్లో ఒమిక్రాన్ పట్ల ఉన్న తక్కువ భావనను ఎత్తిచూపిన పవార్.. ప్రధాని మోదీ సమీక్ష విషయాన్ని గుర్తుచేశారు.
నెల్లూరు జిల్లా, నెల్లూరు వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఏపీ తాజా వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్" width="1600" height="1600" /> దేశ వ్యాప్తంగా రాత్రి పూట లాక్ డౌన్ విధించే దిశగా కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించబోతోందనడానికి మరో రుజువు.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ చేసిన కామెంట్లు. తమ రాష్ట్రంలో రాత్రి పూట లాక్ డౌన్ విధింపునకు సుముఖంగా ఉన్నామన్నారు. అంతేకాదు, కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించేదాకా మధ్యప్రదేశ్ లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తామని చెప్పారు.
ఒమిక్రాన్ పై ప్రధాని మోదీ కీలక సమీక్ష తర్వాత ఒక ముఖ్యమంత్రి, మరో డిప్యూటీ సీఎం ఒకే అంశంపై ప్రధాని మోదీని, కేంద్రాన్ని కోట్ చేస్తూ మాట్లాడటం, ప్రధాని సమీక్షపై వెలువడిన ప్రకటనలోనూ కఠిన నిర్ణయాలు తప్పవనే హెచ్చరిక ఉన్న నేపథ్యంలో రాత్రి పూట లాక్ డౌన్ విధింపుపై కేంద్రం ఒక స్పష్టమైన వైఖరినే తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒమిక్రాన్ పై సమీక్ష సందర్భంగా ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, జిల్లా స్థాయి మొదలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా ఉంచుకోవాలన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్, కరోనా టెస్టులతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.
వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న, కోవిడ్ కేసులు పెరుగుతున్న, ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు పంపాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అందరం కలిసి సమష్టిగా కరోనాను ఎదుర్కొందామని ప్రధాని పిలుపునిచ్చారు.
విజయవాడ వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ వార్తులు, ఆంధ్రా వార్తలు, ఆంధ్ర ప్రదేశ్, వార్తలు, వార్తలు, Lockdown in Andhra Pradesh, AP Lockdown, ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్, ఏపీ లాక్ డౌన్, Covid Winners," width="1200" height="800" /> దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నమోదైన కేసులతో 300 మార్కుని దాటేశాయి. ఈ ఒక్కరోజే (డిసెంబర్ 23,2021) తమిళనాడులో అత్యధికంగా 33 ఒమిక్రాన్ కేసులు రాగా.. మహారాష్ట్రలో 23 వచ్చాయి. కాగా, ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 104 మంది వరకు కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది.