United states: ఒక ఎలుగు బంటి దారి తప్పి వరాహాల ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించింది. అప్పుడు దానికి ఊహించని షాక్ ఎదురైంది. వరాహాలు బయటకు వచ్చాయి . అప్పుడు ఒకదాని తర్వాత.. మరోకటి గ్యాప్ ఇవ్వకుండా ఎలుగు బంటిని కుమ్మేశాయి.
అమెరికాలో ఉన్న జంతువుల ఎన్ క్లోజర్ లోకి ఒక ఎలుగు బంటి ప్రవేశించింది. అది వరాహాలు ఉన్న ఎన్ క్లోజర్. అవి బయటకు వచ్చి , ఎలుగు బంటికి వేరైటీగా వెల్ కమ్ చెప్పాయి. మా ఎన్ క్లోజర్ కే వస్తావా .. ఎలుగు బంటికి చుక్కలు చూపించిన వరాహాలు..
2/ 5
ఎలుగు బంటికి ఏం అర్ధం కాలేదు. రెండు వరాహాలు ఒకేసారి దాడిచేయడంతో అది ఖంగుతింది. మొదట ఎలుగు బంటి కూడా పోరాడింది. కానీ కాసేటికి వీటితో గెలవలేనని దానికి అర్థమైంది.
3/ 5
రెండు వరాహాలు ఒకేసారి దాడిచేయడంతో.. ఆ తర్వాత.. బాబోయ్.. వీటితో నాకేందుకు అనుకుందో.. కానీ.. వెంటనే ఎన్ క్లోజర్ గేటు ఎక్కి బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది.
4/ 5
ఇక మీకు దండంరా బాబు.. అంటున్నట్లు అక్కడి నుంచి వెనుక్కు తిరిగి చూడకుండా పారిపోయింది. వామ్మో.. కాస్తలో బతికి పోయా.. ఇలా దాడి చేస్తారా.. అన్నట్లు తిరిగి వెనక్కు తిరిగి చూసింది.
5/ 5
సాధారణంగా అడవిలో జంతువులు ఒక్కొసారి వేరే జంతువు ఆవాసాలకు వెళ్తుంటాయి. అక్కడ.. ఉన్న జంతువులు కొత్తగా వచ్చిన వాటిపై దాడికి తెగబడతాయి. ఇది మా అడ్డా.. అన్నట్లు వాటిని అక్కడ నుంచి తరిమేస్తాయి. ఇక్కడ ఎలుగు బంటికి కూడా అలాంటి పరాభవం ఎదురైంది.