Photos : ఇవి నిజమైన పిల్లులేనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..!
Photos : ఇవి నిజమైన పిల్లులేనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..!
ఈ ప్రపంచంలో కుక్కల్ని పెంచుకుంటున్న వారు ఉన్నట్లే.. పిల్లుల్ని కూడా పెంచుకుంటున్నారు చాలా మంది. వాటి పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా రన్ చేస్తున్నారు. అలాంటి ఓ అకౌంట్ ఎందుకు వైరల్ అయ్యిందో తెలుసుకుందాం. (All Images Credit : Instagram - kimbingmeiii7)
ఈ రెండు పిల్లుల్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఇవి నిజమైన పిల్లులా లేక గ్రాఫిక్సా అనిపిస్తోందా? అలా అనిపిస్తే.. మీరు కూడా.. కోట్ల మంది లాగానే ఆలోచిస్తున్నట్లు లెక్క.
2/ 13
ఈ పిల్లులు చాలా క్యూట్‌గా ఉండటంతో... ఈ ఫొటోలు స్టన్ అయ్యేలా చేస్తున్నాయి నెటిజన్లను. ఐతే.. ఇవి నిజమైనవా, నకిలీవా అన్నది వారు అర్థం చేసుకోలేకపోతున్నారు.
3/ 13
ఈమధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు, ఫొటోలు తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇవి కూడా అలాగే వైరల్ అయ్యాయి.
4/ 13
ఈ పిల్లులు ఇన్స్టాగ్రామ్ లోని kimbingmeiii7 అకౌంట్లో ఉన్నాయి. ఇందులో ఇలాంటి పిల్లులు చాలా ఉన్నాయి.
5/ 13
మంచుతో కూడిన మైదానంలో ఈ పిల్లులు సరదాగా తిరుగుతున్నట్లు ఫొటోలు కనిపిస్తున్నాయి.
6/ 13
మంచు ప్రదేశంలోకి ప్రత్యేకంగా ఈ పిల్లుల్ని తీసుకెళ్లి.. ఫొటోషూట్ చేసినట్లుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి.
7/ 13
ఈ మార్జాలాలు ఇంత అందంగా, క్యూట్‌గా ఉండటం చూసి నెటిజన్లు క్యూట్‌నెస్ ఓవర్ లోడ్ అంటున్నారు.
8/ 13
చాలా మంది ఈ పిల్లుల్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇవి నిజమైనవి కాకపోవచ్చని కొందరు, నిజమైనవే కావచ్చని మరికొందరు అంటున్నారు.
9/ 13
"ఇవి నిజమైనవేనా" అని ఓ యూజర్ ప్రశ్నించగా... "ఇవి నిజమైనవా, గ్రాఫిక్సా" అని మరో యూజర్ ప్రశ్నించారు.
10/ 13
ఇంకా చాలా మంది కామెంట్స్‌లో రకరకాల హార్ట్ ఇమోజీలను పోస్ట్ చేస్తున్నారు.
11/ 13
ఈ అకౌంట్లో 1800కి పైగా ఫొటోలున్నాయి. 11 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. వారంతా ఈ పిల్లుల ఫొటోలు చూస్తూ లైక్స్ కొడుతున్నారు. అందువల్ల ఇవి ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యాయి.
12/ 13
ఈ ఫొటోలలో కొన్ని నిజమైనవి, కొన్ని గ్రాఫిక్స్ అని అంటున్నారు. ఇలాంటి అకౌంట్స్‌కి ఫాలోయర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి.. మనీ కూడా బాగా వస్తుంది.
13/ 13
ఈ అకౌంట్లో పిల్లులతో అప్పుడప్పుడూ యాడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. పిల్లులకు వాడే వస్తువులు, డ్రెస్సులతో ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. తద్వారా ఆయా వస్తువుల తయారీ కంపెనీల నుంచి భారీగా ప్రమోషన్ మనీ వస్తుంది.