ఆ తర్వాత మింటు ఊరేగింపు వైభవంగా బయటకు వచ్చింది. డప్పు వాయిద్యాలు మోగిస్తూ పెళ్లి ఊరేగింపు సందడి చేశారు. ఈ పెళ్లితో ఇరు కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. రెండు చిలుకలకు పెళ్లి జరిపించారనే విషయం తెలిసిన గ్రామస్తులు రెండు చిలుకల యజమానుల్ని అభినందించారు. పెళ్లికి వచ్చిన గ్రామస్తులంతా వధూవరులుగా ఉన్న రామచిలుకల జంటను ఆశీర్వదించారు.