అసలే లాక్డౌన్.. పని లేకపోయే సరికి వాళ్లకు పైసా పుట్టలేదు.. చేతిలో చిల్లి గవ్వ లేక ఆకలికి అలమటించారు.. గత్యంతరం లేక ఓ హోటల్లోకి దూరి దొంగతనానికి పాల్పడ్డారు.
2/ 6
పది మంది కలిసి హోటల్‌కు వెళ్లినా ఏ ఒక్కరూ.. ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. మరి ఏం దొంగతనం చేశారో తెలుసా..? హోటల్లోని వంట సరుకులతో వంట చేసుకున్నారు.
3/ 6
ఫోన్ టార్చ్ వెలుగులో హోటల్లోకి ఎంటరైన ఆ ఆకలి దొంగలు.. సీసీ కెమెరా వైర్ కట్ చేసి కడుపు నిండా తినేసి వెళ్లిపోయారు. ఉదయం హోటల్ యజమాని వచ్చి చూసేసరికి వంట సామానంతా చిందరవందరగా పడేసి ఉంది.
4/ 6
డబ్బు ఎత్తుకెళ్లిపోయారేమోనని.. కౌంటర్ వద్దకు వెళ్లి చూడగా ఒక్క రూపాయి కూడా పోలేదు. దీంతో ఆకలితో వచ్చినవాళ్లు.. ఇలా చేసి ఉంటారని అర్థం చేసుకున్నాడాయన.
5/ 6
ఈ ఘటన గుజరాత్‌లోని జునాగఢ్ పట్టణంలో ఉన్న గజానన్ పరోటా హోటల్లో చోటుచేసుకుంది.