కొన్ని సంఘటనలు చెప్పడానికే కాదు వినడానికి కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లో జరిగిన ఓ సంఘటన కూడా ఇప్పుడు అంతే ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్కి చెందిన డెలాబాయి అనే మహిళ భర్త, అత్తమామలతో కలిసి కొద్ది రోజుల క్రితం దేశ సరిహద్దు ప్రాంతమైన అట్టారి బోర్డర్ దగ్గర చిక్కుకుపోయారు. (File Photo)
అయితే బోర్డర్లో చిక్కుకుపోయిన గర్భిణికి ప్రసవం సమయంలో పంజాబ్ సరిహద్దు గ్రామాల్లోని కొందరు మహిళలు వచ్చి పురుడు పోసేందుకు సహాయం చేసినట్లుగా చేలాబాయి భర్త తెలిపారు. మొత్తం 98 మందితో కలిసి భారత్కు వచ్చారు. దేశ సరిహద్దులు దాటి వచ్చిన వాళ్ల దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో పాకిస్తాన్ వెళ్లలేకపోయారు. (File Photo)