కరాచీలో మంగళవారం యూనివర్సిటీలో సూసైడ్ బాంబర్ గా మారిన మృతురాలి పేరు షారీ బలోచ్ (30). ఆమె జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అదే విధంగా, ఎంఫిల్ పట్టా పొందింది. టీచర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త డెంటిస్ట్. తండ్రి ఒక లెక్చరర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఊహ తెలియని ఇద్దరు పసిపిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు. ఇంకొరికి ఐదేళ్లు.