ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, చలి, తలనొప్పి కళ్లు, ఒళ్లు, కండరాల నొప్పులు, శరీర నొప్పులు, దద్దుర్లు వస్తాయి. పురుగు కాటుకు గురైన 10 రోజులలోపు ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా.. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్‌ను నివారించడానికి టీకా అందుబాటులో లేదు. ఇన్ఫెక్షన్ సోకిన వారితో సంబంధాన్ని నివారించడం ముఖ్యం. అయితే.. కాటు ద్వారా క్రమంగా ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. స్క్రబ్ టైఫస్ నివారణకు.. చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులను పిల్లలకు ధరించాలని సూచిస్తున్నారు. దొమతెరలను ఉపయోగించాలని పేర్కొంటున్నారు.