ప్రస్తుతం అందరికీ ఆదాయ మార్గాల్లో నెంబర్ వన్ గా నిలుస్తోంది యూట్యూబ్.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది దీనిని సంపాదన కోసం వాడుకుంటున్నారు. అయితే కొందరికి మాత్రమే ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. కొన్ని లక్షల మందికి యూట్యూబ్ సంపాదన ఎలా అన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో లక్ష వ్యూవర్స్ రావడమే గగనమైంది. కానీ తమిళనాడుకు చెందిన ఓ యూట్యూబ్ ఛానెల్ కోటి సబ్స్క్రైబర్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
సాధారణంగా 10 లక్షల సబ్స్క్రైబర్లు పొందడానికే.. యూట్యూబ్ ఛానళ్లు నానా తంటాలు పడుతుంటాయి. ఆ టార్గెట్ను చేరడానికే ఎన్నో ఏళ్లు పడుతుంది. అలాంటి.. ఓ యూట్యూబ్ ఛానల్.. పెట్టిన మూడేళ్లకే కోటి సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అది కూడా దేశంలోని ఓ ప్రాంతీయ భాషకు చెందిన ఛానల్ అందుకోవడం విశేషం.