Business Plan : లేటు వయసులో సూపర్ ఐడియా .. కలర్‌ఫుల్ బిజినెస్
Business Plan : లేటు వయసులో సూపర్ ఐడియా .. కలర్‌ఫుల్ బిజినెస్
Business Plan : వయసు పెరిగే కొద్దీ చాలా మందికి.. ముసలితనంలో లైఫ్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత మనీ వస్తుందా అనే ఆలోచన వెంటాడుతుంది. ఏదైనా అనారోగ్యం వస్తే.. సంపాదించిన సొమ్మంతా దానికే అయిపోతుందేమో అనే ఆందోళన ఉంటుంది. ఇలాగే ఆలోచించిన ఓ ముసలామె.. అద్భుతమైన ఐడియాతో వ్యాపారవేత్తగా మారిపోయింది. లేటు వయసులోనూ భారీగా సంపాదిస్తోంది. ఎలాగో తెలుసుకుందాం. (All images credit - facebook - sweaterkat)
ఈమె పేరు క్యాట్వైజ్. అమెరికా.. న్యూయార్క్ లోని కింగ్‌స్టన్‌లో ఉంటోంది. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన క్యాట్.. రకరకాల ఆర్ట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారుచేసేది. అలా ఆమె జీవితం గడిచిపోయింది. ఐతే.. 50 ఏళ్ల తర్వాత ఆమె లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.
2/ 13
చిన్నప్పటి నుంచి రకరకాల రంగులను ఇష్టపడిన ఆమె.. ఆ కలర్స్ తోనే ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనుకుంది. ఆ సమయంలో ఆమెకు.. కలర్‌ఫుల్, మెరిసే డ్రెస్సులు తయారుచేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.
3/ 13
కొంతమంది బొమ్మలు చేస్తారు, ఇంకొందరు పెయింటింగ్స్ వేస్తారు, మరికొందరు నగలు తయారుచేస్తారు ఇలాంటి వాటిని etsy అనే వెబ్సైట్లో అమ్ముకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న క్యాట్.. తాను తయారుచేసే డ్రెస్‌లను ఆ సైట్లో అమ్మాలని నిర్ణయించుకుంది.
4/ 13
క్యాట్వైజ్ అనే అకౌంట్ ఓపెన్ చేసిన క్యాట్.. తాను క్రియేటివ్‌గా ఎలాంటి డ్రెస్సులు తయారుచెయ్యాలి అని ఆలోచించింది. అప్పుడు ఆమెకు ఓ విషయం బాగా అర్థమైంది. చాలా క్లాత్ షోరూంలలో.. ఏళ్లుగా అమ్ముడవ్వకుండా కొన్ని రకాల బట్టలు ఉంటున్నాయని గుర్తించింది. వాటిని చాలా తక్కువ ధరకే పొందవచ్చని తెలుసుకుంది.
5/ 13
అలాంటి బట్టలను సేకరించిన క్యాట్.. వాటిని ముక్కలు చేసి.. రకరకాల రంగుల క్లాత్‌లను వాటికి జతచేసి.. సరికొత్తగా తయారుచేయడం ప్రారంభించింది. అందువల్ల అవి మెరుస్తూ ఎట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి.
6/ 13
జీవితం రంగుల మయంలా ఉండాలంటున్న క్యాట్.. వేసుకునే బట్టలు నివసించే ఇల్లు అన్నీ కలర్‌ఫుల్‌గానే ఉండాలని చెబుతోంది. తన ఇంటిని, వాహనాన్ని కూడా కలర్ఫుల్గా మార్చేసింది.
7/ 13
లేటు వయసులో ఆమె చేపట్టిన ఈ క్రియేటివ్ బిజినెస్ బాగా క్లిక్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఆమె పట్టుదలను మెచ్చుకుంటూ.. ఆమె దగ్గర బట్టలు కొంటున్నారు.
8/ 13
ఒక్కో స్వెట్టర్ ధరను దాదాపు రూ.1000కి అమ్ముతోంది క్యా్ట్. ఈ ప్యాచ్‌వర్క్ బాగుండటంతో ఆమెకు ఇట్సీలో 5 స్టార్ రేటింగ్ ఉంది.
9/ 13
ప్రస్తుతం క్యాట్ దగ్గర పిల్లల మొదలు పెద్దల వరకూ అన్ని వయసుల వారికీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. విదేశాల్లో చలి ఎక్కువ కాబట్టి.. ఆమె ఎక్కువగా స్వెట్టర్లు, సాక్స్‌లు తయారుచేస్తోంది.
10/ 13
తాను తయారుచేసే డ్రెస్సులను తానే వేసుకొని యాడ్ ప్రమోషన్ చేసుకుంటోంది క్యాట్. ఇందుకోసం ఆమె ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బట్టలతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేస్తోంది. అలాగే యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తోంది.
11/ 13
చాలా మంది కస్టమర్లు ఈ డ్రెస్సులు ఆకర్షణీయంగా ఉన్నాయని అంటున్నారు. వీటిని ఆమె తయారుచేసిన స్టైల్ కూడా ఆసక్తిగా ఉందని అంటున్నారు. ప్రతీ డ్రెస్సూ దేనికదే ప్రత్యేకంగా ఉందని అంటున్నారు.
12/ 13
క్యాట్ వల్ల చాలా పాత బట్టలు వాడుకలోకి వస్తున్నాయి. అదే సమయంలో.. నెటిజన్లు వాటిని కొనుక్కొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆమె వ్యాపారం అన్ని రకాలుగా ప్రయోజనం కలిగిస్తోంది.
13/ 13
ప్రస్తుతం క్యాట్.. తాను వివిధ రకాల బట్టలను ఎలా తయారుచేస్తున్నదీ ట్యూటోరియల్స్ కూడా చెబుతోంది. అలా మరింతమందికి ఈ ఆర్ట్‌ను చేరవేస్తోంది.