Nostalgia : పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎన్నో రకాల చిరుతిళ్లు తింటాం. పెద్దయ్యాక ఎప్పుడైనా వాటి ఫొటోలు చూస్తే.. మనకు బాల్యం గుర్తొస్తుంది. ఆ చాక్లెట్లు, చిరుతిళ్లు మనల్ని గతంలోకి తీసుకెళ్తాయి. 80, 90లో పిల్లలు రకరకాల చిరుతిళ్లు లభించేవి. అవేవీ ఇప్పుడు మార్కెట్లలో లేవు. కానీ తమిళనాడు.. మధురైలో మాత్రం ఓ షాపులో అవన్నీ లభిస్తున్నాయి. మీకు అవి కావాలి అనుకుంటే.. మీరు తెప్పకులం ఏరియాలోని ఈ షాపుకి వెళ్లొచ్చు.
మమ్మీ డాడీ, ఆశ చాక్లెట్, పుల్ల ఐసు, మామిడి తాండ్ర, పీచు మిఠాయి, పల్లీ కోడి గుడ్డు, పేపర్ అప్పడం, పేపర్ బిస్కెట్, పాలకోవా, కలర్ జెల్లీలు ఇలా ఎన్నో రకాల చిరుతిళ్లు 90లో పిల్లలకు లభించాయి. వాటిలో కొన్ని తియ్యగా, కొన్ని పుల్లగా ఉండేవి. మరికొన్ని నోటిని ఎర్రగా చేసేవి. ఇంకొన్నింటిని ముందుగా ఆడుకొని తర్వాత తినేసేవారు. ఇవన్నీ వారికి తెగ నచ్చేవి.