నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వేడుక శుక్రవారం రాత్రి ముంబైలో అట్టహసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మన దేశంలోని అనేక కళలను ప్రొత్సహించేదిశగా ఈ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఈ కల్చరల్ సెంటర్ ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ నీతా అంబానీ లు డ్రీమ్ ప్రాజెక్ట్.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా రంగానికి చెందిన దిగ్గజ నటీ నటులు, అనేక రంగాలలో తమదైన మార్క్ చూపించిన పలువులు ప్రముఖులు హజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో.. ముఖేష్ అంబానీ సతీమణి, నీతా అంబానీ చేసిన నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో మరో హైలేట్ గా నిలిచింది. నీతా అంబానీకి చిన్న తనం నుంచే డ్యాన్స్ అంటే ఎంతో ఆసక్తి.
ఆమె 6 ఏళ్ల ప్రాయం నుంచే భరతనాట్యం నేర్చుకొవడం పట్ల ఇంట్రేస్ట్ చూయించారు. ఆ తర్వాత.. దీనిలో ప్రావీణ్యం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్ లో కూడా నీతా అంబానీ.. గులాబీ రంగు దుపట్టా, ఎరుపు రంగు మేళవింపుతో కల్గిన కాస్ట్యూమ్ లు ధరించి, పాటకు తగ్గట్టుగా తన హావాభావాలు ప్రదర్శిస్తు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారు.
ఈ గ్రాండ్ లాంచ్ కోసం ప్రత్యేకంగా కొరియోగ్రఫీ చేసిన 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. నీతా అంబానీ చేసిన నృత్య ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, పలువులు సినిమా, రాజకీయరంగాల వారు మంత్రముగ్ధులవుతున్నారు.
ఇక మరో వైపు సినీ దిగ్గజ ప్రముఖులు.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కూతురు సౌందర్యతో కలిసి ఈవెంట్ కు వచ్చారు. విద్యాబాలన్, అమీర్ ఖాన్, యాక్టర్ మీజాన్ జాఫ్రీ, అనూషా దండేకర్, సచిన్ టెండుల్కర్ ఆయన భార్య అంజలి కూతురు సారా, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుటుంబం, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హజరయ్యారు.