Viral: ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ఒకేసారి ఆరుగురు భార్యల కడుపు పండించాడు
Viral: ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ఒకేసారి ఆరుగురు భార్యల కడుపు పండించాడు
మాతృత్వ స్పర్శను పొందడానికి చాలా మంది అల్లాడుతుంటారు. సంతానం లేక తల్లిదండ్రులు ఎందరో దేవుళ్లకు వేడుకున్నా... ఫలాలు దక్కవు. ఒక భార్యకు గర్భం రావడం లేదని మరో భార్యను పెళ్లి చేసుకునేవాళ్లూ ఉన్నారు. కానీ నైజీరియాలో ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఓకేసారి ఆరుగురు భార్యల కడుపు పండించాడు.
నైజేరియాకు చెందిన Pretty Mike అనే వ్యక్తి అక్కడ సోషల్ మీడియాలో ఒక సంచలనం. అతడు చేసే వీడియోలతో స్థానికంగా అతడు గుర్తింపు పొందాడు. ఆరుగురు భార్యలను పెళ్లి చేసుకున్న మైక్ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యాడు.
2/ 6
మైక్... ఆరుగురు భార్యలను పెళ్లి చేసుకోవడం ఒక వార్త అయితే.. తాజాగా వాళ్లందరూ ఒకేసారి గర్భంతో ఉండటం మరో సంచలనం.
3/ 6
ఇటీవలే మైక్ ఒక వివాహ వేడుకకు హాజరయ్యాడు. అందులో అతడి ఆరుగురు భార్యలు కూడా వచ్చారు. మైక్ గులాబీ జాకెట్ లో మెరిసిపోతుండగా.. అతడి భార్యలు తెల్ల దుస్తులలో అందరి దృష్టిని ఆకర్షించారు. వారంతా గర్భిణీ స్త్రీలు..
4/ 6
దీనిపై మైక్ స్పందిస్తూ.. ఇదేం తాను కావాలని చేసిన వ్యూహం కాదని.. ఏదో అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు.
5/ 6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మైక్.. గతంలో చేసిన పలు పోస్టులు వివాదాస్పదమయ్యాయి. తన భార్యలకు గొలుసు కట్టి స్థానిక వీదుల్లో తింపుతూ అతడు తీసిన ఫోటో విమర్శలకు దారి తీసింది.
6/ 6
ఎన్ని విమర్శలు వచ్చినా మైక్ మాత్రం తన పంథాను వీడలేదు. తాను చేయాలనుకున్న పనిని చేశాడు.