Tomato Flu : కరోనా ముందు వరకూ ప్రతి ఒక్కరూ.. మనం ఉన్నది సేఫ్ వరల్డ్ అని నమ్మేవారు. ఎప్పుడైతే కరోనా వచ్చి.. జీవితాల్ని అల్లకల్లోలం చేసిందో.. అప్పటి నుంచి మనం ఉన్నది సేఫ్ వరల్డ్ కాదని ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడో ఏదో ఒకటి మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందనే వాస్తవాన్ని వారు గ్రహించారు. వారి అంచనా నిజమే అవుతోంది. రెండేళ్లు చావగొట్టిన కరోనా (Covid-19) పోయింది కదా అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. నేనున్నా అంటూ టమాటా ఫ్లూ (tomato flu) ఇండియాను గడగడలాడిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
టమాట ఫ్లూ అనేది ఒక రకమైన వైరస్. ఇదో రకం వేరియంట్. దీన్ని చెయ్యి, నోటి వ్యాధి అంటారు. ఇలా పిలవడం క్యాచీగా లేదు కాబట్టి.. టమాట ఫ్లూ అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇది సోకిన వారికి చేతులు, నోటికి ఎర్రటి పొక్కులు వస్తాయి. జ్వరం కూడా వస్తుంది. ప్రస్తుతం ఇది రాష్ట్రాలను వణికిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రారంభంలో , , రాష్ట్రాల్లో టమాటా ఫ్లూ కేసులు బయటపడ్డాయి. కేరళలోని కొల్లం జిల్లాలో మొదటి కేసు మే 6, 2022న నమోదైంది. కేరళ ఆరోగ్య విభాగం.. ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తోందో గమనిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా వ్యాపించకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
టమాటా ఫ్లూ అనేది ప్రాణాలు తీసేంత భయంకరమైన వ్యాధి కాదు. ఇది కోక్స్సాకీ వైరస్ A16 (Coxsackie virus A16) అనే వైరస్ ద్వారా వ్యాపిస్తోంది. ఇది వేగంగా వ్యాపించగలదు. ముక్కు, నోరు నుంచి వచ్చే ద్రవాలు, కఫం ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తోంది. దీని వల్ల స్కూళ్లలో చదువులకు సమస్య వస్తోంది. వ్యాధి సోకిన పిల్లల నుంచి పెద్దవాళ్లకు కూడా ఇది సోకగలదు అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎవరికైనా చేతులు, నోటిపై దద్దుర్లు, పొక్కులు, కురుపుల వంటివి వచ్చి.. దురదగా అనిపిస్తూ ఉంటే... మిగతా వారు అప్రమత్తం అవ్వాలి. అవి వచ్చిన వారిని విడిగా ఉంచాలి. విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఎక్కువగా గోరువెచ్చని నీరు, ఇతర ద్రవాలు తాగించాలి. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వాడొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. లక్షణాలను బట్టీ చికిత్స ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి టమాటా ఫ్లూకి మందులు, వ్యాక్సిన్ వంటివి ఏవీ లేవు. (ప్రతీకాత్మక చిత్రం)