బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే అందులో చాలా విషయాలు అసాధారణంగా ఉంటాయి. అలా జరుగుతుందా అని ప్రశ్నించేలా చేస్తాయి. ఐతే.. ఆ కాలజ్ఞానంలో కొన్ని అంశాలు ఆల్రెడీ జరగడంతో.. దాన్ని చాలా మంది నమ్ముతున్నారు. విదేశాల్లో కాలజ్ఞానం లేకపోయినా... టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడి ప్రజలు టైమ్ ట్రావెలర్ల పట్ల ఆసక్తి చూపిస్తారు. నిజంగా ఈ టైమ్ ట్రావెల్ అనేది ఉందా అంటే కచ్చితమైన ఆన్సర్ లేదు. కానీ చాలా మంది తాము భవిష్యత్తు నుంచి ప్రస్తుత కాలంలోకి వచ్చామని చెబుతూ.. టిక్‌టాక్ వీడియోల ద్వారా భవిష్యత్తులో ఇవి జరుగుతాయి అని కొన్ని అంశాలు చెబుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి అదే చేశాడు.
అతని పేరు ఏరీ యోర్మనీ (Aery Yormany). టిక్‌టాక్‌లో ఇతనికి ఎస్థెటిక్టైమ్వార్పెర్ (@esthetictimewarper) అనే పేరుతో అకౌంట్ ఉంది. అతనికి 12 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. తన అకౌంట్లో అతను తాజాగా ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో.. కొన్ని దృశ్యాలతోపాటూ... టెక్స్ రూపంలో మెసేజ్‌లు పెట్టాడు.
ఈ వీడియో పోస్ట్‌కి 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీనిపై యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా, కాదా అనే అంశంపై తమ అభిప్రాయాల్ని కామెంట్స్‌లో ఇస్తున్నారు. "ఇవేవీ జరగకూడదని అనుకుంటున్నాను" అని ఓ యూజర్ రిప్లై ఇవ్వగా.. "నువ్వు మూడేళ్లుగా ఏలియన్స్ వస్తారని చెబుతూనే ఉన్నావు" అని మరో యూజర్ స్పందించారు. "ఇలాంటి అంచనాలు నాకు ప్రతీ సంవత్సరం ఇష్టమే" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.