పర్పుల్ కలర్లో పూసే ఈ పూలను చూసేందుకు... ఆ ప్రకృతిలో విహరించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముందుగా కొడగు జిల్లాకు వచ్చి... అక్కడి నుంచి ఈ కొండలకు వస్తున్నారు. డబ్బు ఉండాలే గానీ ఈ పూలను ఆకాశం నుంచి చూసేందుకు ఈసారి హెలికాప్టర్ టాక్సీలు కూడా ఉన్నాయి. హెలీ-టాక్సీ సంస్థ తంబీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆఫర్ ఇస్తోంది. (Photo credit - twitter)
మందల్పట్టి కొండలు... పశ్చిమ కనుమల్లో ఉంటాయి. ఇవి చాలా అందంగా ఉండే కొండలు. అందువల్లే ఇక్కడకు కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. లక్కీగా ఈసారి అన్ని కొండలపైనా ఈ పూలు బాగా వచ్చాయి. ఇదివరకు కొండలపై కొన్ని చోట్ల మాత్రమే ఇవి కనిపించేవని ఫారెస్ట్ డిప్యూటీ కన్సర్వేటర్ పూవయ్య చెప్పారు. (Photo credit - twitter)