National Chocolates Day : మన జీవితాలు చాక్లెట్లతో ముడిపడి ఉంటాయి. పుట్టాక.. ఏడ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులు చాక్లెట్లు ఇచ్చి.. సైలెంట్ చేస్తారు. పుట్టిన రోజులు, వేడుకలు, జెండా పండుగలప్పుడు చాక్లెట్లు పంచుకుంటాం. ప్రేమను వ్యక్తం చేయడానికి చాక్లెట్, స్నేహాన్ని పంచడానికి చాక్లెట్.. ఇలా ప్రతీ సందర్భంలో చాక్లెట్ ఇచ్చుకోవడం మనకు అలవాటు. అదుకే వాటికోసం నేషనల్ చాక్లెట్ డే ఉంది. ప్రతీ సంవత్సరం నవంబర్ 29న జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుతున్నాయి ప్రపంచ దేశాలు.
చాక్లెట్ల తయారీలో కీలకమైన కోకో పండ్ల తోటలకు ఆఫ్రికా దేశాలు ప్రసిద్ధి. ఇప్పుడు ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కోకో పంటల సాగు బాగా జరుగుతోంది. కోకో గింజలను సేకరించి.. వాటిని ఎండబెట్టి.. శుభ్రపరచి.. తర్వాత రోస్ట్ చేస్తారు. వాటిని పొడిగా మార్చి.. పాలు, పంచదార ఇతర పదార్థాలు కలుపుతారు. అలా చాక్లెట్ తయారవుతుంది.
చాక్లెట్స్ తింటే బరువు పెరుగుతామనే అభిప్రాయం కొందరిలో ఉంది. అది నిజం కూడా. చాక్లెట్లను ఎక్కువగా తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. అలా జరగకూడదంటే.. తినే చాక్లె్ట్లో 70 శాతం కోకో ఉండేలా చూసుకోవాలి. తద్వారా మిగతా 30 శాతంలో పాలు, పంచదార ఇతర పదార్థాలు ఉంటాయి. అలాంటి చాక్లెట్లు అంతగా బరువు పెరగనివ్వవు.