Home » photogallery » trending »

NASA SHARES PHOTOS OF POWER OUTAGE IN ODISHA AFTER CYCLONE FANI BS

NASA PICS: బుసలు కొట్టిన ఫణి.. అతలాకుతలం అయిన ఒడిశా.. సాక్ష్యాలివిగో..

ఫణి తుఫాన్.. బుసలు కొట్టి ఒడిశాను అతలాకుతలం చేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఒడిశా సముద్ర తీర ప్రాంత నగరాలు, గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. తుఫాన్ వల్ల పూరి, భువనేశ్వర్, కటక్, ఖుర్దాల్లో పలువురు మరణించగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల తీర ప్రాంత నగరాలు, గ్రామాల్లో 35లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. గాలుల వల్ల విద్యుత్తు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలిపోవడంతో టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ, మొబైల్ టవర్లు దెబ్బతిన్నాయి. కాగా, ఫణి సృష్టించిన అల్లకల్లోలం అనంతరం అక్కడ నెలకొన్న పరిస్థితులపై అంతరిక్ష చిత్రాలను నాసా గురువారం విడుదల చేసింది. ఫణి తుఫాన్‌కు ముందు ఏప్రిల్ 30న ఒడిశా తీరంపై తీసిన ఫోటో, తుఫాన్ అనంతరం మే 4న తీసిన చిత్రాలను నాసా విడుదల చేసింది.