ఇలా పాంజియా విడిపోవడం అన్నది 17.5 కోట్ల సంవత్సరాల కిందట మొదలైంది. భూమిలోని పలకలు అటూ ఇటూ కదులుతుంటే... పాంజియా ఖండం విడిపోక తప్పలేదు. చిత్రమేంటంటే... ఈ రోజుకూ ఖండాలు కదులుతూనే ఉన్నాయి. చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. అందువల్ల ఆ విషయం మనకు తెలియదు. అప్పుడప్పుడూ భూకంపాలు వస్తుండటానికి కారణం అదే. (image credit - wikipedia)
శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం... భూమధ్య. రేఖ (equator) దగ్గర ఓ భారీ ఖండం ఏర్పడుతుంది అంటున్నారు. ఈ ఖండం ఎంత పెద్దగా ఉంటుందంటే... ఇది భూమధ్య రేఖ నుంచి ఉత్తరార్థ గోళమంతా ఉంటుందట. అంటే... ఇప్పుడున్న ఖండాలన్నీ మళ్లీ కలుస్తాయనుకోవచ్చు. ఐతే... దిగువన ఉండే అంటార్కిటికా మాత్రం అక్కడే, విడిగానే ఉంటుందని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందుకు సంబందించిన అధ్యయన వివరాల్ని జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, జియోసిస్టమ్స్లో జులై 19న ప్రచురించారు. ఈ పరిశోధన చేసిన వారిలో... అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) గొడ్డార్డ్ ఇన్‌స్టి్ట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్‌లో పనిచేస్తున్న మైకెల్ వే కూడా ఉన్నారు. ఈ పరిణామాన్ని మనం ఎవ్వరమూ చూడలేం. మనమే కాదు... మన తర్వాత వచ్చే చాలా తరాల వారు కూడా చూడలేరు. అసలు ఈ ఖండాలన్నీ ఏకమయ్యే సమయంలో మనుషులు ఇతర గ్రహాలపైకి వెళ్తూ ఉండొచ్చు కూడా. (ప్రతీకాత్మక చిత్రం) (image credit- google maps)