Asteroid: మన సౌరకుటుంబంలో... అంగారక (Mars) గ్రహం, గురు (Jupiter) గ్రహం మధ్య చాలా గ్రహశకలాలు ఉన్నాయి. కోట్ల సంవత్సరాల కిందట అక్కడ ఉండే ఓ గ్రహం ముక్కలైపోవడం వల్లే ఆ గ్రహశకలాలు ఏర్పడ్డాయనే అంచనా ఉంది. వాటిలో కొన్ని అప్పుడప్పుడూ భూమివైపు వస్తుంటాయి. అలాంటి ఓ గ్రహశకలం... తాజ్‌మహల్ కంటే 3 రెట్లు పెద్దగా ఉన్నది జులై 24న అర్థరాత్రి తర్వాత భూమికి దగ్గరగా వస్తోంది. అంటే నేడు మనం నిద్రపోతున్న సమయంలో ఇది వచ్చి వెళ్లిపోతుంది అన్నమాట. ఇది క్రికెట్ స్టేడియం అంత సైజు ఉంటుందని అంచనా. (image credit - NASA)
అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) ప్రకారం... ఆస్టరాయిడ్ 2008 GO20... మొత్తం 220 మీటర్ల వ్యాసార్థం (diameter)తో ఉంది. ఇది గంటకు 28,968 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. అంటే సెకండ్‌కి 8కిలోమీటర్ల వేగంతో వస్తోంది. ఇది హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి నిమిషం 17 సెకండ్లలో వెళ్లగలదు. అంత వేగంగా వెళ్లే గ్రహశకలం భూమిని ఢీకొంటే ఇంకేమైనా ఉందా.. భూమికి భారీ గొయ్యి ఏర్పడగలదు. లక్కీగా ఇవాళ అలా జరగదని నాసా తేల్చింది. ఐతే... ఆ గ్రహశకలం వచ్చే దారిలో దానికి ఏదైనా అడ్డు వస్తే... ఆ వచ్చినది తుక్కు తుక్కు అవ్వడం ఖాయం. (image credit - NASA)
భూమికీ, చందమామకూ మధ్య ఉన్న దూరంతో పోల్చితే... ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 12 రెట్లు దూరంగా ఉన్నట్లే. కానీ నాసా మాత్రం దీన్ని భూమికి దగ్గరగా ఉన్న గ్రహశకలాల్లో ఒకటిగా చేర్చింది. అంటే ఇప్పుడు కాకపోయినా... ఎప్పుడైనా ఈ గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. భూమికి 19 కోట్ల 40 లక్షల కిలోమీటర్ల లోపు వచ్చే గ్రహశకలాలను దగ్గరగా ఉండే ఆస్టరాయిడ్లు (near-earth object)గా నాసా చెబుతోంది. ఇలాంటివి ఓ 2వేల దాకా మన సౌరకుటుంబంలో ఉన్నాయి. (image credit - NASA)
శక్తిమంతమైన ప్రమాదకరమైన గ్రహశకలాల్లో ఇవాళ వచ్చేది కూడా ఒకటి అని నాసా తేల్చింది. ఇలాంటి ఆస్టరాయిడ్లను నాసా టెలిస్కోపులు రోజూ గమనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకటి భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంటే... ముందే తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నది నాసా ఆలోచన. గ్రహశకలాలతో ఉన్న సమస్యేంటంటే... అవి గ్రహాలలాగా ఒకే దిశలో వెళ్లవు. వాటికి కక్ష్యామార్గం అనేది ఉండదు. అవి వెళ్లే దారిలో... మరేదైనా గ్రహశకలం వాటిని ఢీకొంటే... రూట్ మారిపోతుంది. అలా మారిన గ్రహశకలం... భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉండొచ్చు. అందుకే నాసా వాటిపై ఎప్పుడూ ఫోకస్ పెడుతూనే ఉంటుంది. (image credit - NASA)



