MUMBAI RAINS UPDATES WATER LOGGING TRAFFIC JAMS IN SEVERAL PARTS OF THE CITY AND AIRLINES ISSUE TRAVEL ADVISORY NK
Mumbai rains : భారీ వర్షాలతో మునుగుతున్న ముంబై... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్...
Mumbai rains updates : ప్రతీ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు రాగానే ముంబై వణికిపోతుంది. భారీ వర్షాలు ఆ నగరాన్ని ముంచెత్తుతాయి. ఈసారీ అదే జరిగింది. ఉదయం నుంచీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సిటీలో చాలా చోట్ల వాన నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి.
భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతాయి. ఉదయం నుంచీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సిటీలో చాలా చోట్ల వాన నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి.
2/ 21
వాన అంటే ముంబై ప్రజలకు చాలా ఇష్టం. ఎందుకంటే అది అప్పటివరకూ ఉన్న తీవ్ర ఎండల్ని తరిమేస్తుంది. కానీ... అదే వాన ముంబై ప్రజలకు నరకం కూడా చూపిస్తుంది.
3/ 21
ఈ ఏడాది కాస్త ఆలస్యంగా ముంబైలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడికక్కడ వాన నీరు ప్రవాహంలా సాగుతోంది.
4/ 21
ఏది రోడ్డో, ఏది కాలువో తెలియట్లేదు. ఎటు వెళ్దామన్నా నీరే కనిపిస్తోంది చాలా చోట్ల.
5/ 21
ధరవి, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ నుంచీ తప్పించుకోవడం ముంబై ప్రజల వల్ల కావట్లేదు.
6/ 21
ముంబైలో అపార్ట్మెంట్లపై వర్షం పడుతున్న దృశ్యం (Image : Twitter / @saurab)
7/ 21
ముంబైలో అపార్ట్మెంట్లపై వర్షం పడుతున్న దృశ్యం (Image : Twitter / @saurab)
8/ 21
ప్రస్తుతానికి రైళ్లు టైముకి నడుస్తున్నాయి. విమాన సర్వీసులపై మాత్రం ప్రభావం కనిపిస్తోంది.
9/ 21
నిజానికి ఈ నీరు ముంబైలోని రిజర్వాయర్లు నిండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
10/ 21
ఐతే... వర్షపు నీరు రోడ్లు, రైల్వే ట్రాక్‌లపై నిలిచిపోవడం ఇబ్బంది కలిగించే అంశం. థానే రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్స్‌పై నీరు నిలిచిపోయింది.
11/ 21
రైల్వే సర్వీసులు నిలిచిపోకుండా చేసేందుకు ప్రత్యేక రైల్వే పోలీస్ ఫోర్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
12/ 21
గత ఐదు గంటల్లో సగటు వర్షం కురిసినట్లు బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
13/ 21
ముంబైలో వాన నీటి ప్రవాహంతో జలమయమైన రోడ్డు (Image : Twitter / ANI)
14/ 21
వాన నీటి ప్రవాహంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు (Image : Twitter / ANI)
15/ 21
పట్టపగలే చీకటిగా అయిపోయిన ముంబై రోడ్లు (Image : Twitter / ANI)
16/ 21
ముంబైలో వర్షం కురుస్తున్నందున విమాన సర్వీసులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులను ముందుగానే హెచ్చరించింది.
17/ 21
గత 36 గంటల్లో నాశిక్ జిల్లాలో అత్యధికంగా 37 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే ఉంది.
18/ 21
నాశిక్‌లో వర్షం వల్ల ఓ టీనేజ్ అమ్మాయి సహా ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు.
19/ 21
ముంబై ప్రాంతాలైన కుర్లా, శాంతాక్రజ్, కొలాబా, బోరీవాలీ, కండీవాలీ, బద్లాపూర్, పాన్వెల్, షాపూర్లో ఎక్కువ వర్షం కురిసింది.
20/ 21
వానలు కురుస్తున్నందువల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గింది. ప్రస్తుతం అది 24 డిగ్రీలుగా ఉంది. మేఘాల వల్ల సూర్యుడు కనిపించట్లేదు.
21/ 21
ఈ వారాంతంలో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.