Home » photogallery » trending »

MUKESH AMBANI IS TOP PHILANTHROPIST IN INDIA HURUN LISTS MOST GENEROUS INDIANS SS

అపర కుబేరులే కాదు... దానగుణంలోనూ వీరు అపర కర్ణులే

వేల కోట్ల సంపద కూడబెట్టుకొని అపర కుబేరులు అని పేరు తెచ్చుకోవడమే కాదు... ఆపదొస్తే ఆదుకోవడంలో, దాన గుణంలో అపరకర్ణులే అని నిరూపిస్తున్నారు భారతదేశానికి అత్యంత సంపన్నులు. హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన జాబితాలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దాతల్లో టాప్‌గా నిలిచారు. 2017 అక్టోబర్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 మధ్య రూ.10 కోట్ల కన్నా ఎక్కువ విరాళం ఇచ్చిన భారతీయుల జాబితాను రూపొందించింది హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఆ జాబితాలో టాప్‌లో నిలిచింది వీళ్లే...