ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. చంద్రపూర్ అడవి ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. అయితే, దుర్గాపూర్ ప్రాంతంలో గత మంగళవారం.. జ్యోతి పుప్పాళ్వార్ అనే తల్లి తన బిడ్డకు రాత్రిపూట వాకిట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతుంది. అప్పుడు ఒక చిరుతపులి మెల్లగా వచ్చింది. పాపం.. తల్లి తన బిడ్డకు అన్నం పెడుతుంది. ఆమె పులిని గమనించలేదు.
పులి ఒక్కసారిగా పసిబిడ్డపై దాడిచేసింది. ఆమె దవడ భాగంను పట్టుకుంది. లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. ఈ పరిణామంతో ఆమె షాక్ కు గురయ్యింది. వెంటనే తేరుకొని తన కూతురిని కాపాడుకోవాలని బలంగా అనుకుంది. చిరుత పులిపై తన చేతులతో బలంగా కొట్టడం చేసింది. ఆ తర్వాత.. అక్కడే ఉన్న కర్రలు తీసుకుంది. గట్టిగా అరుస్తూ.. పులిపై దాడిచేసింది.