నేపాల్ పర్వత లోయల్లో తము అని పిలిచే తెగ ప్రజలు ఉంటారు. వారినే గురుంగ్ ప్రజలు అంటారు. వీరు ఎవరు, వీరి చరిత్ర ఏంటి అనే దానిపై లిఖిత పూర్వక ఆధారాలేవీ లేవు. వీరు క్రీస్తుశకం 6వ శతాబ్దంలో టిబెట్ నుంచి నేపాల్ మధ్య ప్రాంతానికి వలస వచ్చారని నమ్ముతారు. వీరు అత్యంత అరుదైన తేనెను సేకరిస్తారు. ఇందుకోసం సంప్రదాయ పద్ధతుల్నే పాటిస్తున్నారు. (Image credit - twitter - themadhoney)
నేపాల్లోని హిమాలయాల దిగువ ప్రాంతంలో గురుంగ్ ప్రజలు.. సంవత్సరానికి రెండుసార్లు తేనె వేటకు వెళ్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద తేనెటీగలు కట్టే తేనెపట్టులను వీరు టార్గెట్ చేస్తారు. పర్వతాల రాళ్లకు అతుక్కుని ఉండే తేనెపట్టు నుంచి తేనెను సేకరించడం తేలికైన విషయం కాదు. పొరపాటున జారి పడితే... ప్రాణం పోతుంది. ఎందుకంటే ఆ తేనెటీగల్ని చేరుకునేందుకు వీరు.. 200 అడుగుల ఎత్తైన తాడు నిచ్చెనలు వేసుకుంటారు. ఆ నిచ్చెనలపై ఎక్కుతూ ప్రాణాలు పణంగా పెడతారు. తేనెను సేకరించడంలో వీరు ఎంతో టాలెంట్ కలిగివుంటారు. (Image credit - twitter - themadhoneynepal)
తేనె సేకరణ ప్రారంభించడానికి ముందు తేనె వేటగాళ్ళు... రాతి దేవతలను శాంతింపజేయడానికి ఒక వేడుకను నిర్వహిస్తారు. ఇదులో ఒక గొర్రెను బలి ఇవ్వడం,.. పూలు, పండ్లు, బియ్యం సమర్పించడం వంటివి ఉంటాయి. పర్వతాలు ఎక్కేటప్పుడు.. తమను రాతి దేవతలు కాపాడతారని తేనె వేటగాళ్ళు భావిస్తారు. (Image credit - twitter - themadhoney)
అపిస్ లాబొరియోసా (apis laboriosa) తేనెటీగలు ప్రపంచంలోనే పెద్దవి. ఇవి పర్వతాల్లో తేనెను పోగేస్తాయి. వీటిని తేనెతుట్టె నుంచి పంపించేందుకు వేటగాళ్లు పొగపెడారు. టాంగోస్ అని పిలిచే పొడవాటి కర్రకు ఒక చివర కొడవలి ఉంచి.. దాని ద్వారా తేనెతుట్టెను కోస్తారు. ఆ సమయంలో అందులోని తేనెటీగలు.. మరో తేనెతుట్టె వైపు వెళ్లిపోతాయి. అలా తేనెతుట్టెను కిందకు తెస్తారు. ఈ ప్రయత్నంలో వేటగాడికి సపోర్టుగా దాదాపు 12 మంది సభ్యుల బృందం సిద్ధంగా ఉంటుంది. దాదాపు 20 కేజీల తేనెను సేకరించి.. గ్రామస్థుల మధ్య పంపిణీ చేస్తారు. ఆ తర్వాత వారంతా ఆనందంగా కప్పు తేనె టీ తాగుతారు. (Image credit - twitter - Bhawy)