వేసవి కాలంలో ఎక్కువ మంది ఈ ప్రదేశాలకు విహార యాత్రకు వెళ్తుంటారు. ఎండల నుంచి ఉపశమనం కోసం చల్లని, అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. అయితే భారత్‌లో పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రాంతానికి టూర్ ప్లాన్ చేస్తుంటే.. వేసవికాలంలో భారత్‌లో చూడదగ్గ అందమైన గ్రామాలు కొన్ని బెస్ట్ డెస్టినేషన్‌గా చెప్పుకోవచ్చు. అవేంటి, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.
(ప్రతీకాత్మక చిత్రం)
కల్ప- హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో కల్ప ఒకటి. సట్లేజ్ నదీ లోయలో ఉండే ఈ గ్రామం వేసవిలో చూడదగ్గ అందమైన ప్రదేశం. ఇది కిన్నౌర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం సమీపంలో ప్రసిద్ధ స్పితి వ్యాలీ ఉంది. ఇక్కడ ఉండే కైలాష్ పర్యత శిఖరాలు ఆకాశాన్ని తాకినట్లుగా కనిపిస్తాయి. కల్పలో ఎటుచూసినా తోటలు దర్శనమిస్తుంటాయి. మంచుతో కప్పి ఉండే పర్వతాల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు.(ప్రతీకాత్మక చిత్రం)
జులుక్- సిక్కిం : హిమాలయ పర్వతశ్రేణుల్లో 3000 మీట్లర ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది. చైనా సరిహద్దులకు సైన్యాన్ని తరలించేందుకు ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పినట్లు ఉంటుంది. ఇక్కడ ఉదయం పూట సూర్యోదయం చూడటానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. తంబి, లుంగ్తుంగ్ వ్యూ పాయింట్స్ నుంచి హిమాలయాల అందాలను ఆస్వాదించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
మనా - ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో మనా గ్రామం ఒకటి. చమోలి జిల్లాలో సరస్వతి నది ఒడ్డున ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఈ గ్రామం నుంచి 5 కి.మీ దూరంలో ఉంది. చైనా సరిహద్దుల్లో ఉండే ఈ ప్రదేశం భారతదేశ చివరి గ్రామంగా గుర్తింపు పొందింది. ప్రకృతికి నిలయమైన అనే చూడదగ్గ ప్రదేశాలు మనా పరిసరాల్లో చాలా ఉన్నాయి. అందులో ఒకటి నీలకంఠ శిఖరం. మంచుతో నిండిన ఈ శిఖరం బద్రీనాథ్ ఆలయానికి మంచు అందాలను తీసుకొచ్చింది. వసుంధర జలపాతం, భీమా పుల్ రాతి వంతెన, తప్త్ కుండ్ వేడి నీటి బుగ్గలు మానాలోని ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.(ప్రతీకాత్మక చిత్రం)
మాథూర్- తమిళనాడు : తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉంటుంది ఈ చిన్న గ్రామం. దక్షిణ భారతంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ గ్రామం సమీపంలో నీటిని తరలించే అక్విడెక్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి పచ్చదనం పర్చుకున్న పశ్చిమ కనుమలు, గలగలా పారే పహ్రాలి నది అందాలను తిలకించవచ్చు. ఇటీవల కాలంలో ఈ గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాథూర్ అక్విడెక్ట్ పర్యాటక ప్రాంతం కన్యాకుమారి, రాజధాని త్రివేండ్రం పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)