Photos : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు... వరద నీటితో ప్రజల కష్టాలు
Photos : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు... వరద నీటితో ప్రజల కష్టాలు
South West Monsoon : ఈ సంవత్సరం మన దురదృష్టమేంటోగానీ... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సరిగా కురవట్లేదు. పైన మేఘాలైతే ఉంటున్నాయి గానీ చినుకు రాలట్లేదు. ఎక్కడో ఒకటీ అరా తప్పితే... వానాకాలం వానలే లేవు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం కుంభవృష్టితో కుమ్మేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన 10 మంది వర్షాల వల్ల చనిపోయారంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
శ్రీనగర్‌లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నెమ్మదిగా వెళ్తున్న వాహనాలు
2/ 45
బర్‌పేటలో సివిల్ హాస్పిటల్లోకి వర్షపు నీరు వచ్చేయడంతో... ముఖ్యమైన ఫైళ్లను మోసుకెళ్తున్న ఉద్యోగులు
3/ 45
మోరిగాన్లోని లహరి ఘాట్ గ్రామంలో బ్రిడ్జిని మింగేసిన బ్రహ్మపుత్రా నది వరద.
4/ 45
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వరద నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న పెద్దాయన.
5/ 45
అసోంలోని కామరూప్ జిల్లా... హాజో గ్రామంలో నీరు ప్రవహిస్తున్న రోడ్డుపై నుంచీ వెళ్తున్న వాహనదారులు.
6/ 45
ముజఫర్‌పూర్ జిల్లాలోని ముషారీ దగ్గర వరద నీటిలో మునిగిపోయిన గ్రామం.
7/ 45
ముజఫర్‌పూర్‌లో వరద నీటిలో విరిగిపడిన రోడ్డును చూస్తున్న స్థానికులు.
8/ 45
ముజఫర్‌పూర్ జిల్లాలోని ఆరాయ్లో ఇళ్లలోకి ప్రవహిస్తున్న వరద నీరు.
9/ 45
భీర్భూమ్ జిల్లాలోని... జాయ్‌దేవ్ దగ్గర వరద నీటిలో పడవలో వెళ్తున్న స్థానికులు.
10/ 45
తూర్పు చంపారన్‌లోని చిత్రయ్య బ్లాక్ దగ్గర వర్షపు నీటితో కోత పడిన రోడ్డు.
11/ 45
త్రిపురలోని అగర్తలాలో వరద నీటిలో మునిగిపోయిన కార్లు.
12/ 45
త్రిపురలోని అగర్తలా శివార్లలో వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న NDRF బృందం.
13/ 45
ఖాట్మండులో తన కూతుర్ని వరద నీటి నుంచీ కాపాడుకుంటున్న తండ్రి.
14/ 45
అసోంలోని... మోరిగావ్‌లో వరద ప్రాంతం నుంచీ వేరే ప్రదేశానికి భర్త, సామగ్రితో వెళ్లిపోతున్న మహిళ.
15/ 45
కామరూప్లోని హాజోలో వరద నీటిలో కొట్టుకుపోయిన రోడ్డును చూస్తున్న ప్రజలు.
16/ 45
గౌహతీలోని మాయోంగ్ గ్రామంలో... వరద నీటిలో ముందుకెళ్తున్న మహిళ.
17/ 45
అసోంలోని కామరూప్ జిల్లాలో... వరద నీటిలో సగం మునిగిపోయిన ఆలయం. (Image: PTI)
18/ 45
అసోంలోని మోరిగావ్ జిల్లాలో... బాలిముఖ్ గ్రామంలో... మునుగుతున్న ఇంటి దగ్గర పడవలో వెళ్తున్న గ్రామస్థులు (Image: AFP)
19/ 45
నాగాలాండ్‌లోని దిమాపూర్‌లోని రగాయ్లాంగ్ కాలనీలో వరద నీటిలో వెళ్తున్న చిన్నారి. (Image: AFP)
20/ 45
బెంగాల్... సిలిగిరికి 40 కిలోమీటర్ల దూరంలోని సెటిజ్హోరా దగ్గర వర్షపు నీటి వల్ల జాతీయ రహదారి 10పై విరిగిపడిన కొండచరియల్ని చూస్తున్న వ్యక్తి. (Image: AFP)