కొందరు తమ ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా కురవాలని ప్రార్థనలు చేస్తుంటారు. దీని కోసం కొన్ని ప్రాంతాలలో ఆయా పద్దతులను పాటిస్తుంటారు. కొన్ని చోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. మరికొన్ని చోట్ల దేవాలయాలలోని విగ్రహలకు జల దిగ్భందం చేస్తారు. మరికొన్ని చోట్ల.. అనేక పద్ధతులు పాటిస్తుంటారు. అయితే, ఈ ప్రాంతంలో వర్షం కురవాలని వెరైటీగా మొసలితో పెళ్లి చేస్తారు. ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మెక్సికన్ లోని ప్రజలు ఇప్పటికి కొంత వింత సంప్రదాయం పాటిస్తున్నారు. నైరుతి మెక్సికన్ లోని శాన్ పెడ్రో హువామెలులా గ్రామంలో ఎక్కువగా వర్షాలు పడాలని ఆ ప్రాంతానికి చెందిన మేయర్ హ్యూగో సోసా కు మొసలితో పెళ్లి జరిపించారు. పిల్ల మొసలికి కొత్త బట్టలు తొడిగారు. ఆ తర్వాత ఊరిలో ప్రజల మధ్య మొసలితో పెళ్లి తంతు జరిపించారు.
పెళ్లి తర్వాత.. మేయర్ మొసలిని ప్రేమతో ముద్దులు కూడా పెట్టుకున్నాడు. దాన్నిలిటిల్ ప్రిన్సెస్ అని కూడాపిలుస్తారు. పెళ్లి వేడుకలో సాంప్రదాయ డీజేలు, డ్యాన్స్ లు కూడా ఉన్నాయి. పెళ్లికొడుకు.. మొసలిని ముద్దులు కూడా పెట్టుకున్నాడు. వీరిని అక్కడ వీధులలో తింపారు. ప్రస్తుతం తగినంతా వర్షం పడాలని తరతరాలుగా ఇదే సంప్రదాయం పాటిస్తామని తెలిపారు.ఈ గ్రామం.. శాన్ పెడ్రో హువామెలులా ఓక్సాకా పసిఫిక్ తీరంలో ఉన్న ఒక చిన్న మత్స్యకార గ్రామం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.